Walking: రోజుకి ఎన్ని వేల అడుగులు వేయాలంటే..!
Benefits of walking everyday
Benefits of walking 45 minutes a day
20 benefits of walking
10 health benefits of walking
Benefit of walking 1hour a day
By
Pavani
Walking: రోజుకి ఎన్ని వేల అడుగులు వేయాలంటే..!
నడకతో మధుమేహం, గుండె జబ్బు.. వంటి జీవనశైలి వ్యాధుల నుంచీ రక్షించుకోవచ్చన్నది తెలిసిందే. అయితే రోజుకి ఎనిమిది వేల అడుగులు వేస్తే మరణాన్ని వాయిదా వేయొచ్చని స్పెయిన్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రనాడా పరిశోధకులు శాస్త్ర పూర్వకంగా చెబుతున్నారు. గతంలో పది వేల అడుగులు వేస్తే మంచిది అని చెబుతూ వచ్చారు.
కానీ తాజాగా లక్ష మందిని పరిశీలించినప్పుడు- అంత అవసరం లేదనీ, ఏడు నుంచి తొమ్మిది వేల అడుగుల్లోపు నడవడం వల్లే మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయనీ అంటున్నారు. కాస్త అటూ ఇటూగా ఎనిమిది వేల అడుగులు అంటే- సుమారు 6.4 కిలోమీ టర్లు నడిచినా చాలట. ఎందుకంటే పదివేల అడుగులు వేస్తే మంచిదన్న కారణంతో కొందరు కష్టంగా ఉన్నా ఆ నంబరు వచ్చేవ రకూ నడుస్తున్నారు. అలా ఎక్కువ నడిస్తే నష్టం ఏమీ ఉండదు. కానీ అధిక బరువు ఉన్నవాళ్లు వేగంగా నడవలేరు. పైగా కష్టపడి నడవడం వల్ల గుండెమీద ఒత్తిడి పడుతుంది. అంతేకాదు, అంతా ఒక్కరోజులోనే ఈ సంఖ్యకు చేరుకోలేకపోవచ్చు. కాబట్టి 2,500 నుంచి 3000లతో మొదలు పెట్టి నెమ్మదిగా ప్రతి పదిహేనురోజులకి ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువు ఉన్న వాళ్లు వెయ్యితో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని వివరిస్తున్నారు!
Comments