Helmet: బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి..
Helmet: బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి..
- హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యం చేరండి..
- వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
- జిల్లా ఎస్పీ K.రఘువీర్ రెడ్డి IPS
నంద్యాల జిల్లా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వాటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న వారే ఎక్కువగా అతివేగం మరియు అజాగ్రత వలన ,రోడ్డు భద్రత ,ట్రాఫిక్ నిభందంలు పాటించక ముఖ్యంగా హెల్మెట్ దరించక పోవడం వలన ప్రమాదాలకు గురౌతు ప్రాణాలు కోల్పోతున్నారు.
గత నెల 26-06-2024 న తాండావ .యోగేష్ V/S స్టేట్ ఒఫ్ ఏ. పి హై కోర్ట్ ఉత్తర్వుల మేరకు ఇకపై ద్విచక్ర వాహనదారులు వాహనంను నడుపు నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని హై కోర్ట్ చీఫ్ జస్టీష్ ధర్మాసనం ఆదేశాలు జారీచేశారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన యాక్షిడెంట్ డేటా ఆదారంగా AP లో 3703 కేసులలో 3042 మంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలలో చనిపోయారని వీరందరూ కేవలం హెల్మెట్ దరించకపోవడం వలన ఇంతమంది పౌరులు చనిపోయారని దిగ్బ్రంతి వ్యక్తం చేశారు.
విజయవాడ లాంటి పెద్ద పట్టణాలలో CC ఫుటేజ్ ద్వారా వాహనాల రద్దీని గౌరవ హైకోర్ట్ వారు పరిశీలన చేయగా చాలా తక్కువ మంది హెల్మెట్ ను వాడుతున్నారని అభిప్రాయం వ్యక్తంచేశారు.కావున ఇకపై ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని పోలీసు మరియు రవాణా శాఖను ఆదేశిస్తు నిభందనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీచేయడం జరిగింది.
స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు జూలై 04-07-2024 నుండి 31-07-2024 వరకు పోలీసులు,రవాణా శాఖ అదికారులు,లాయర్లు,స్వచ్చంద సంస్థలు ప్రజలకు హెల్మెట్ వాడటంవలన కలుగు ప్రయోజనాలను వారికి తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు లీగల్ సర్వీస్ స్టేట్ అథారిటీ పర్యవేక్షించాలి .
పోలీసు ,రవాణా అదికారులు హెల్మెట్ ధారణపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మరియు అన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
నంద్యాల జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ SHO లకు ఇన్స్పెక్టర్ లు ,DSP లు కోర్టు ఆదేశాలను తప్పక పాటించి నిర్భంద హెల్మెట్ దారణ అమలు చెయ్యలని ,ప్రజలలో అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
నంద్యాల జిల్లా పోలీసు అదికారులు వారి సిబ్బందితోపాటు ట్రాఫిక్ నియంత్రణకు ,రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో పోలీసు అధికారులు స్కూల్ మరియు కాలేజీలలో,పబ్లిక్ ప్రదేశాలలో ఆటొ స్టాండ్ లవద్ద ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ కొంతమంది ట్రాఫిక్ నిభందంలు పాటించకుండా ప్రమాదాలకు గురౌతున్నరు.హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా, చాలా మంది అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. హెల్మెట్లు లేకుండానే రోడ్లు మీద బైక్లు నడుపుతూ ఉంటారు.వారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ దరించాలి మరియు అతివేగంగా అజాగ్రత్తగా వెళ్లకుండా మీరు వెళ్లవలసిన సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే బయలుదేరి అతివేగంగా వెళ్లకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని తెలియజేశారు. మీరు చేసే ఒక చిన్న తప్పిదం వల్ల ప్రమాదం సంభవించి మీరు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడడం లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K. రఘువీర్ రెడ్డి IPS గారు బైక్ పై ప్రయాణించే ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేనియెడల పోలీసులు భారీగా ఫైన్ విధించడంతోపాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లాలోని అన్నీ పోలీసు స్టేషన్ SHO లకు, ఇన్స్పెక్టర్ లు ,DSP లు కోర్టు ఆదేశాలను తప్పక పాటించి నిర్భంద హెల్మెట్ దారణ అమలు చెయ్యలని ,ప్రజలలో అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీచేయడం జరిగింది.
హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించండి .ప్రమాదాలలో బండి నడుపుతున్న వ్యక్తితో పాటు కొన్నిసార్లు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా మీరు చేసే తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.కావున జిల్లా ప్రజలు ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.ఇది మీ సంక్షేమం కొరకు తీసుకునే చర్యలో భాగంగా గుర్తించాలని తెలియజేశారు. హెల్మెట్ దరించకపోవడం వలన ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు.