TG DSc Examsడీఎస్సీ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదు..
TG DSc Examsడీఎస్సీ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు లేదు..
డీఎస్సీని వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థుల నిరసన
18 నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టీకరణ
11వ తేదీ సాయంత్రం నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని వెల్లడి
తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు యథాతథంగా ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపింది.
డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు ఇటీవల నిరసనకు దిగారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వరుసగా పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో చదువుకోవడానికి సమయం సరిపోదని అభ్యర్థులు అంటున్నారు. అయితే డీఎస్సీ యథాతథంగా నిర్వహించనున్నట్లు నేడు విద్యాశాఖ ప్రకటించింది.