-Advertisement-

Mark Rutte: 14 ఏళ్లు ప్ర‌ధానిగా సేవ‌లు.. ఓట‌మి త‌ర్వాత సైకిల్‌పై ఇంటికి..!

Mark rutte Nederland prime minister daily telugu news daily political updates in Telugu latest crime news intresting facts current affairs in Telugu..
Priya

Mark Rutte: 14 ఏళ్లు ప్ర‌ధానిగా సేవ‌లు.. ఓట‌మి త‌ర్వాత సైకిల్‌పై ఇంటికి..!

నెద‌ర్లాండ్స్ ప్ర‌ధానిగా 14 ఏళ్లు సేవ‌లందించిన మార్క్ రుట్టే

కొత్త పీఎంగా ఎన్నికైన డిక్ షూఫ్‌కు బాధ్య‌త‌ల అప్ప‌గింత‌

అనంత‌రం సాధార‌ణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయిన రుట్టే

Mark rutte Nederland prime minister daily telugu news daily political updates in Telugu latest crime news intresting facts current affairs in Telugu..

నెద‌ర్లాండ్స్ ప్ర‌ధాన‌మంత్రిగా 14 ఏళ్లు సేవ‌లందించిన మార్క్ రుట్టే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే కొత్త పీఎంగా ఎన్నికైన డిక్ షూఫ్‌కు అధికారికంగా బాధ్య‌త‌లు అప్ప‌గించి రుట్టే సాధార‌ణ పౌరుడిగా సైకిల్ తొక్కుంటూ వెళ్లిపోయారు. అయితే, ఇలా చేయ‌డం ఆ దేశ ఆచార‌మ‌ని అంటున్నారు. ఎలాగైతే ఖాళీ చేతుల‌తో ప్ర‌జ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డానికి వ‌చ్చారో, అలాగే వెళ్లిపోవ‌డం అక్క‌డ జ‌రుగుతుంద‌ట‌.

అలా రుట్టే సైకిల్‌పై వెళ్లిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆయ‌న సైకిల్‌పై అధ్య‌క్ష భ‌వ‌నం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో కొంతమంది రుట్టేను చప్పట్లు కొట్టి ప్ర‌శంసించ‌డం వీడియోలో చూడొచ్చు. అయితే, రూట్టేకు ‘సైకిల్ రైడ్‌’ చేయ‌డం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సభలకు సైకిల్‌పై వ‌చ్చి త‌న‌ నిరాడంబరతను, అంకితభావాన్ని చాటారాయ‌న‌. 

ఇక 14 ఏళ్లు నెద‌ర్లాండ్స్ ప్ర‌ధానిగా సేవ‌లు అందించిన మార్క్ రుట్టే.. వ‌చ్చే ఏడాది 'నాటో' కొత్త సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.

Comments

-Advertisement-