WhatsApp: వాట్సాప్ స్కామ్స్ బారీన పడకూండా.. ఈ విషయాలు నిర్ధారించుకోండి..!
WhatsApp: వాట్సాప్ స్కామ్స్ బారీన పడకూండా.. ఈ విషయాలు నిర్ధారించుకోండి..!
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించే వాట్సాప్ ఆసరాగా మార్చుకొని కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. వాటి బారిన పడకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోండి.
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) ద్వారా జరిగే మోసాలకు హద్దే లేకుండా పోతోంది. ఎంత అప్రమత్తంగా ఉంటున్నా కొత్త పంథాతో కేటుగాళ్లు అమాయకులకు ఎర వేస్తూనే ఉన్నారు. ఫలానా బ్యాంకుకు చెందిన వారంటూ సమాచారం సేకరించడం దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపించడం వరకు అనేక అవతారాలు ఎత్తి డబ్బులు ఎగరేసుకుపోతున్నారు. ఇలాంటి వారి వలలో చిక్కకుండా ఉండాలంటే ఇకపై వాట్సప్లో మెసేజ్ చేసేముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
నిర్ధారణ ముఖ్యం: మీకు లాటరీ తగిలిందనో లేదా ఉచితంగా రుణం అందిస్తున్నామనో వ్యక్తిగత వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తారు. నిజమేనేమో అని వెంటనే మెసేజ్ చేయకుండా.. నిజంగానే కంపెనీ నుంచి సంప్రదిస్తున్నారా? లేదా? అనే విషయం నిర్ధారణకు వచ్చాకే ప్రతిస్పందించడం ముఖ్యం.
లింక్లకు దూరంగా: బహుమతులు, డిస్కౌంట్లు అని సందేశం పంపుతూ వాటితోపాటు గంటలోపే మీ వివరాలు అందిచాలని కోరుతుంటారు. అలా వచ్చిన లింక్లపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం వారి చేతికి అందించినట్లే. అంతే కాదు జాబ్ ఆఫర్లు, పెట్టుబడుల సలహాలు అంటూ ఫేక్ అకౌంట్ల నుంచి సమాచారం సేకరించేందుకు ప్రయత్నించే వారు ఎక్కువయ్యారు. వారి బారిన పడకుండా ఉండాలన్నా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను ధ్రువీకరించాకే సంభాషణలు జరపండి.
టూ- స్టెప్ వెరిఫికేషన్: వాట్సప్కు మరింత భద్రత జోడించేందుకు టూ- స్టెప్ వెరిఫికేషన్ ను ఎనేబుల్ చేసుకోవడం ముఖ్యం. కేటుగాళ్లకు మీ ఫోన్ నంబర్ తెలిసినా అకౌంట్ యాక్సెస్ చేయకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది.