Nandikotkur municipality: నందికొట్కూరులో భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల బైబై.. టీడీపీలో చేరిక
Nandikotkur municipality: భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల బైబై.. టీడీపీలో చేరిక
నందికొట్కూరులో వైసీపీకి షాక్..
టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్
కౌన్సిలర్లు..
మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిక..
నందికొట్కూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్న టీడీపీ..
Nandikotkur:ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో.. వైసీపీకి గుడ్బై చెబుతున్నారు ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు.. ఇక, నంద్యాల నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఏపీ షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు.. టీడీపీకి గూటికి చేరారు.. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు, 2 కో ఆప్షన్ నెంబర్లు.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.. మొత్తంగా కొడుకును కాదని పెదనాన్న పక్షంలో మున్సిపల్ ప్రజాప్రతినిధుల సభ జరిగింది.. ఇక, మున్సిపాలిటీనీ అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్టు చైర్మన్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా చైర్మన్ సహా 12 మంది ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పడం.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో.. ఇప్పుడు నందికొట్కూరు మున్సిపాలిటీని టీడీపీ హస్తగతం చేసుకున్నట్టు అయ్యింది.