Online: ఆన్లైన్లో పరిచయం యువతి ఇంటికి వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడు..!
Online: ఆన్లైన్లో పరిచయం యువతి ఇంటికి వచ్చి లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడు..!
- స్నాప్ చాట్ లో పరిచయమైన యువతి పై అత్యాచారం..
- శివరాంపల్లిలో ఘటన..
వయసుకు మించిన పరిచయాలతో ఎప్పుడైనా ముప్పే. సోషల్ మీడియా ద్వారా తమతో పరిచయం ఉన్న వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే అని తెలుసుకోరు. ఇలాంటి వార్తలు మీడియాలో వచ్చిన చూసి చూడనట్లు లైట్ తీసుకుంటారు.
అలాచేసేవారు ప్రమాదపు ఊబిలో కూరుకుపోయినట్లే. హైదరాబాద్కు చెందిన ఓ అమ్మాయి కథ తెలిస్తే ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్ని జరుగుతున్నాయనే దానిపై లెక్క కట్టలేమని అర్థమవుతుంది. స్నాప్చట్ లో పరిచయమైన యువతి ఇంటికే వెళ్లి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో సంచలనంగా మారింది.
శివరాంపల్లిలో నివాసం ఉంటుంన్న ఓ యువతి బీటెక్ చదువుతుంది. ఆమె స్నాప్ చాట్ లో తనకు సంబంధించింది ప్రతిదీ పోస్ట్ చేసేది. అయితే ఈ పోస్ట్లకు ఫాలో అయిన ఓ యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. రోజూ స్నాప్ చాట్ లో చాటింగ్ లు చేసుకునే వారు. అలా రెండు నెలలుగా స్నాప్ చాట్ లో యువతితో చాటింగ్ చేసుకునేవారు. అయితే అతన్ని నమ్మిన యవతి తన అడ్రస్ తో సహా చెప్పింది. అయితే ఆ యువతిని అడ్రస్ వెతుక్కుంటే ఏకంగా శివరాంపల్లిలోని అమ్మాయి ఇంటికే వచ్చేశాడు. అయితే పరిచమైన వ్యక్తి కదా అంటూ ఆమె కూడా మామూలుగానే మాట్లాడింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించాడు యువకుడు. ఒంటరిగా వున్నావా? అని ప్రశ్నించాడు.
అవును అని సమాధానం చెప్పడంతో.. ఇదే అలుసుగ భావించిన ఆ యువకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన యువతి తల్లిదండ్రులు యువతిని చూసి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిది. దీంతో కుటుంబ సభ్యులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఒంటరిగా ఉందని యువకుడికి ఎలా తెలిసింది? శివరాంపల్లిలోనే అమ్మాయి నివాసం ఉన్నట్లు ఎలా తెలుసు? యువకుడు అమ్మాయికి తెలిసిన వ్యక్తేనా? అమ్మానికి ప్లాన్ ప్రకారం స్నాప్ చాట్ ద్వారా ట్రాప్ చేసి అత్యాచారం చేశాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.