-Advertisement-

Noro Virus: కలుషిత నీరు, ఆహారంతో నోరో వైరస్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.!

Norovirus symptoms Norovirus treatment Norovirus without vomiting Norovirus symptoms in adults How to treat norovirus at home How long are you contagi
Peoples Motivation

Noro Virus: కలుషిత నీరు, ఆహారంతో నోరో వైరస్... తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.!

నోరో వైరస్ వ్యాధి కలుషిత నీరు, ఆహారంతో వ్యాపిస్తుందని హెచ్చరిక

చేతులు సబ్బుతో కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం చేయాలని సూచన

ఎక్స్ వేదికగా భాగ్యనగరవాసులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ

Norovirus symptoms Norovirus treatment Norovirus without vomiting Norovirus symptoms in adults How to treat norovirus at home How long are you contagious with norovirus How long does norovirus last Norovirus prevention

భాగ్య నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు అప్రమత్తం చేస్తూ సూచనలు చేసింది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి. 
  • ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.

'నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.' అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Comments

-Advertisement-