-Advertisement-

Of infections: వరదలతో అంటువ్యాధుల ప్రమాదం

Causes of infection Infection symptoms 10 infectious diseases Chain of infection Infection definition medical Infection definition Nursing Causes
Peoples Motivation

Of infections: వరదలతో అంటువ్యాధుల ప్రమాదం

  • పారిశుధ్య పనులకు పెద్దపేట వేయాలి..
  • సీజనల్ వ్యాధుల నివారణకు ఇదే మార్గం..

Causes of infection Infection symptoms 10 infectious diseases Chain of infection Infection definition medical Infection definition Nursing Causes of infection in female

విజయవాడ, జూలై 27 (పీపుల్స్ మోటివేషన్)

ప్రతి ఏటా వానాకాలంలో అంటు వ్యాధులు, ప్రబలడం సర్వసాధారణంగా మారింది చలికాలం వచ్చే సరికి స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులు విజృంభిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్వచ్ఛంగా ఉంచాలని పదేపదే ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు తమకేంటన్న భావనతో అపరిశుభ్రతకు కారణమవుతున్నారు. రాష్ట్రంలో గతంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్ జ్వరాలతో ఇబ్బందులు పడేవారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ప్రజల నిర్లక్ష్యం కారణంగా నగరం కంపు కొడుతోంది. మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం వల్ల ఏలూరులో వింతవ్యాధి గతంలో ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. ఇటీవలి నరదల వల్ల ఉభయ గోదావరిజిల్లాల్లో అంటువ్యాధుల ప్రమాదం ఏర్పడింది. బురదతో పాటు, మంచినీట సమస్య ప్రజలను వెన్నాడుతోంది. ఇకపోతే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నామని నాయకులు చెపుతున్నా వాస్తవం వేరే రకంగా కనిపిస్తోంది. పారిశుద్ధ్య లేమి కారణంగానే ఇటువంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం సుస్పష్టం. ఈ క్రమంలో ప్రజలు పురపాలకసంస్థపై ధ్వజమెత్తుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దోమలు విజృంభించడం, వింతవ్యాధులు విజృంభించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. సీజనల్ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు దోమల నివారణతో పాటుగా పారిశుద్ధ్య నిర్వహణ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి, ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలి. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుధ్యం అత్యంత కీలకమైన అంశం. ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసి, పారిశుద్ధ్య నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు కృషి చేస్తూనే ఉన్నారు. ఇళ్ళలో పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పదేపదే కోరుతున్నారు. ముఖ్యంగా దోమల వృద్ధికి అవకాశం ఉన్న ఉన్న నీటి తొట్లు, నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలో లేని వస్తువులను తీసివేసి, దోమల లార్వా వృద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన పైన దృష్టి సారించి సీజనల్ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభిం చాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు. అప్పుడే సీజనల్ వ్యాధులను రాకుండా నిరోధించగలమని అన్నారు. కాలువల్లో వాడిపడేసిన వ్యర్థాలను, ప్లాస్టిక్ ను  పడేయడం వల్ల కూడా మురికినీరు నిలిచి పోతోంది. దీనికి ప్రజలే బాధ్యత వహించాలి. పారిశుధ్యానికి ప్రజలు నడుం బిగిస్తేనే మంచిది.

Comments

-Advertisement-