PM Modi: భారత్ కు చెందిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ: మన్ కీ బాత్ లో ప్రధాని
PM Modi: భారత్ కు చెందిన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ: మన్ కీ బాత్ లో ప్రధాని
భారతదేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది
పుల్వామా నుంచి తొలి స్నో పీస్ను లండన్కు పంపించాం
గత దశాబ్దంలో భారతదేశంలో అటవీ విస్తీర్ణం పెరిగింది
అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి
కువైట్ ప్రభుత్వం తన జాతీయ రేడియోలో హిందీ ప్రత్యేక కార్యక్రమం
భారత్లో తయారైన ఉత్పత్తుల గురించి ప్రధాని మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించారు.
భారతదేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. భారత్ కు చెందిన ఏదైనా స్థానిక ఉత్పత్తి ప్రపంచవ్యాప్తం మంచి ఆదరణ పొందినప్పుడు గర్వంగా అనిపిస్తుంది. అటువంటి ఉత్పత్తుల్లో అరకు కాఫీ, ఇది ఆంధ్ర ప్రదేశ్లోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయబడుతుంది. ఇది గొప్ప రుచి, సువాసనకు ప్రసిద్ధి చెందింది. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా ముందున్నారు. జమ్మూ కాశ్మీర్లో గత నెలలో చేసిన పనులు దేశ వ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పుల్వామా నుంచి తొలి స్నోపీస న్ను లండన్కు పంపారు. గత దశాబ్దంలో భారతదేశంలో అపూర్వమైన అటవీ విస్తీర్ణం పెరిగింది. అమృత్ మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడు వేలకు పైగా అమృత్ సరోవర్లను కూడా నిర్మించారు. అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి." అని మోడీ వ్యాఖ్యానించారు.
“దేశంలోని వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మనకు గొడుగులు అవసరం. గొడుగులు మన కేరళలో తయారవుతాయి. ఇక్కడి సంస్కృతిలో వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే నేను చెబుతున్న గొడుగు కేరళలోని అట్టప్పాడిలో తయారైన కర్తుంబి గొడుగు. ఈ రంగురంగుల గొడుగుల ప్రత్యేకత ఏమిటంటే వీటిని గిరిజన సోదరీమణులు తయారుచేస్తారు. నేడు దేశవ్యాప్తంగా ఈ గొడుగులకు డిమాండ్ పెరుగుతోంది." అని మోడీ తెలిపారు.
కువైట్ ప్రభుత్వం తన జాతీయ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అది కూడా హిందీలో ఉందని ప్రధాని మోడీ వెల్లడించారు. 'కువైట్ రేడియో'లో ప్రతి ఆదివారం అరగంట పాటు ప్రసారమవుతుందని తెలిపారు. ఇందులో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న రంగులు ఉన్నాయన్నారు. కువైట్ ఇండియన్ కమ్యూనిటీలో మన సినిమాలు, కళారంగానికి సంబంధించిన చర్చలు బాగా ప్రాచుర్యం పొందాయన్నారు. కువైట్ స్థానిక ప్రజలు కూడా దీనిపై చాలా ఆసక్తి చూపుతున్నారని తనకు అక్కడున్న వాళ్లు చెప్పారన్నారు.
'మన్ కీ బాత్'లో నరేంద్ర మోడీ తుర్క్మెనిస్థాన్ గురించి ప్రస్తావించారు. ఈ ఏడాది మేలో తుర్క్మెనిస్థాన్లో జాతీయ కవి 300వ జయంతి వేడుకలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్ మెనిస్థాన్ అధ్యక్షుడు ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఈ విగ్రహాలలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్.. ఇది గురుదేవ్ పట్ల గౌరవం, భారతదేశం పట్ల గౌరవమని ప్రస్తావించారు.