AP Govt: నాడు రూ. 30 పింఛన్.. నేడు రూ. 4 వేల పింఛన్ ఘనత వారిదే
AP Govt: నాడు రూ. 30 పింఛన్.. నేడు రూ. 4 వేల పింఛన్ ఘనత వారిదే
స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే.. 4 వేలకు తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబే..
ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ 4 వేలు చేసి పెంచిన పెన్షన్ ఇస్తున్నాం..
ఏప్రిల్ నుంచే కలిపి 7 వేలు లబ్ధిదారులకు ఇస్తున్నామన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే.. ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం.. పండగ వాతావరణంలో ప్రారంభమైంది.. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.. ఇక, ప్రకాశం జిల్లాలో పెన్షన్ల పంపినీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే, ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబుదే అన్నారు..
ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ 4 వేలు చేసి పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుంచే కలిపి 7 వేలు లబ్ధిదారులకు ఇస్తున్నాం అని గుర్తుచేశారు.. ఇది టీడీపీకి ఉన్న నిబద్ధత అన్నారు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. రెండు వేల పెన్షన్ మూడు వేలు చేసేందుకు ఐదేళ్లు ఆపసోపాలు పడిందిని ఎద్దేవా చేశారు.. కానీ, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.3 వేల పెన్షన్ను రూ.4 వేలకు పెంచామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల లబ్ధిదారులకు ఇవాళ పెంచిన పెన్షన్లు అందజేస్తున్నాం అని వెల్లడించారు. ఇక, రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.