PM Mudra Loan: ముద్రా లోన్ తాజా సమాచారం.. పూర్తి వివరాలు ఇవే..!
PM Mudra Loan: ముద్రా లోన్ తాజా సమాచారం.. పూర్తి వివరాలు ఇవే..!
కొన్ని షరతులు విధించిన ప్రభుత్వం
మూడు కేటగిరీలలో అందుబాటులో రుణం
బడ్జెట్ లో ప్రభుత్వ పథకాల్లో మార్పులకు సంబంధించి
రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచిన ముద్రా లోన్
ఈ కేంద్ర బడ్జెట్లో జులై 23న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఇందులో పన్నులు, ప్రభుత్వ పథకాల్లో మార్పులకు సంబంధించి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటనలు చేశారు. వీటిలో ప్రధాన మంత్రి ముద్రా యోజనకు సంబంధించిన ఒక ప్రకటన కూడా ఉంది. ఈ పథకం కింద వ్యాపారులకు ఇచ్చే రుణాన్ని ఇప్పుడు రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అయితే ఈ ప్రయోజనం కోసం ప్రభుత్వం కొన్ని షరతులు కూడా విధించింది. పీఎం ముద్రా లోన్ అంటే ఏమిటి, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు రుణ పరిమితిని పెంచడం ద్వారా దానిపై ఎలాంటి షరతులు విధించబడ్డాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
2015లో పథకం ప్రారంభం.. పీఎం ముద్రా యోజన 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ప్రధానమంత్రి ముద్ర రుణ పథకం లక్ష్యం. భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ 2024లో, ఈ ప్రభుత్వ పథకం కింద లభించే రుణ పరిమితి రెట్టింపు చేయబడింది.
ముద్ర రుణ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచడంతో పాటు, కొనుగోలుదారులను తప్పనిసరిగా ట్రేడర్స్ ప్లాట్ ఫామ్ లో చేర్చేందుకు, ట్రేడర్ పరిమితిని రూ.500 కోట్ల నుంచి రూ.250 కోట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద, వ్యాపారాన్ని ప్రారంభించడానికి రుణాలు సులభంగా మరియు సరసమైన వడ్డీ రేట్లలో లభిస్తాయి. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద గతంలో తీసుకున్న రుణం పూర్తిగా తిరిగి చెల్లించాలని షరతు విధించారు. రుణాన్ని తిరిగి చెల్లించినవారికే రెట్టింపు రుణం అందించబడుతుంది.
మూడు కేటగిరీలలో రుణం అందుబాటులో ఉంది ప్రభుత్వం మూడు కేటగిరీలలో రుణాలను అందిస్తుంది.
మొదటిది శిశు
దీని కింద దరఖాస్తుపై రూ.50,000 వరకు రుణం ఇస్తారు.
రెండోది కిషోర్ లోన్
ఇందులో రూ.50,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు ఇవ్వబడతాయి.
మూడోది తరుణ్ లోన్
ఈ లోన్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇవ్వబడతాయి.
ఇప్పుడు..
ఇప్పుడు ప్రభుత్వం ఈ తరుణ్ లోన్ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచింది. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా తరుణ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారు ఏ బ్యాంక్లో డిఫాల్టర్ గా ఉండకూడదు. క్రెడిట్ రికార్డ్ కూడా బాగా ఉండాలి. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న పని కోసం దరఖాస్తుదారుకు అవసరమైన నైపుణ్యాలు మరియు అనుభవం ఉండటం అవసరం. ఈ పథకం కింద ఇచ్చే రుణాన్ని కేవలం వ్యాపారానికే వినియోగించాలి.
దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ ప్రక్రియ
ముందుగా www.mudra.org.in వెబ్సైట్ కి వెళ్లండి. హోమ్ పేజీ ఓ పెన్ చేసి.. శిశు, కిషోర్ మరియు తరుణ్ లోన్ ఎంపికలు కనిపిస్తాయి.
బిజినెస్ లోన్ కోసం తరుణ్ లోన్ ని ఎంచుకోండి.
ఇప్పుడు దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ చేయండి. అందులో అడిగిన మొత్తం సమాచారాన్ని క్షుణ్ణంగా నమోదు చేయండి.
దీని తరువాత, దరఖాస్తు ఫారమ్ తో అవసరమైన పత్రాల ఫోటోకాపీలను జత చేయండి.
నింపిన ఫారమ్ లను నమోదు చేసిన సమాచారాన్ని మరోసారి చదివి తనిఖీ చేయండి.
ఈ నింపిన దరఖాస్తు ఫారమ్ ను బ్యాంకుకు సమర్పించండి.
మీ సమాచారాన్ని తనిఖీ చేసిన తర్వాత, బ్యాంక్ దానిని ఆమోదించి, రుణాన్ని పాస్ చేస్తుంది.