Rajya Sabha: ఛైర్మన్-ప్రతిపక్షనేత మధ్య రాజ్యసభ లో ఆసక్తికరమైన సంభాషణ..!
Rajya Sabha: ఛైర్మన్-ప్రతిపక్షనేత మధ్య రాజ్యసభ లో ఆసక్తికరమైన సంభాషణ..!
• రాజ్యసభ ఛైర్మన్.. ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం..
• సభలో సభ్యులు నవ్వులే నవ్వులు..
• నవ్వులు చిందించిన సోనియాగాంధీ.
వారం పార్లమెంట్ ఉభయ సభలు హాట్ హాట్గా సాగాయి. ఇక రాజ్యసభలో అయితే ఛైర్మన్ జగదీప్ ధనఖడ్-కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. తీవ్ర ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి. కానీ తాజా పరిణామాలు అందుకు భిన్నంగా మారిపోయింది. సోమవారం సభలో ధనడ్, ఖర్గే మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దీంతో సభలో సభ్యులు నవ్వులు చిందించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించేందుకు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోతున్నానని.. ఛైర్మన్ అనుమతిస్తే కూర్చొని మాట్లాడతానని కోరారు. ధనడ్ బదులిస్తూ.. సభలో ప్రసంగించేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోమని తెలిపారు. ఇబ్బందిగా ఉంటే కూర్చొని మాట్లాడవచ్చని బదులిచ్చారు. దీనికి ఖర్గే ప్రతి స్పందనగా.. కూర్చొని చేసే ప్రసంగం.. నిలబడి మాట్లాడి చేసేంత ఉద్రేకంగా ఉండదని ఖర్గే నవ్వుతూ చెప్పారు. దీంతో విపక్ష నేత మాటలతో ఛైర్మన్ కూడా ఏకీభవించడంతో ఇద్దరూ నవ్వులు చిందించారు. ఈ విషయంలో తాను సాయం చేస్తానని ధనడ్ అన్నారు. ఛైర్మన్ కూడా కొన్ని సందర్భాల్లో తమకు సాయం చేశారని.. దాన్ని తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని ఖర్గే అనడంతో సభ మొత్తం నవ్వులు విరబూశాయి. ధనఖడ్-ఖర్గేల మధ్య కొనసాగిన సంభాషణలతో సోనియాగాంధీ కూడా నవ్వులు చిందించారు.