Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి..
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు మృతి..
అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం..
నలుగురు అక్కడికక్కడే మృతి..
కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ఘటన..
అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 11:30 ప్రాంతంలో కడప నుంచి రాయచోటికి బయలుదేరిన ఇతియోస్ కారు.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మార్గమధ్యంలోని చిట్లూరు హరిజనవాడ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అఫ్రోజ్, అలీమ్ జితేంద్ర, అంజి నాయక్లు అక్కడికక్కడే మృతిచెందారు.. ఖాదర్ బాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరూ కడపకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుడు అంజి నాయక్భా భకరాపేట బెటాలియన్ లో పోలీసు హోంగార్డుగా పనిచేస్తున్నట్లు తెలుస్తుందని లక్కిరెడ్డిపల్లి సీఐ గంగాధర్ బాబు తెలిపారు. జరిగిన సంఘటన పై రామపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లక్కిరెడ్డిపల్లి సీఐ గంగాధర్ బాబు వెల్లడించారు.
మొత్తంగా రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడ సమీపంలో కడప-చిత్తూరు జాతీయ రహదారి పై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. కడప నుండి రాయచోటికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.