-Advertisement-

RRB Recruitment: రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Railway jobs telugu Railway Jobs 2024 Railway Jobs apply online Railway Jobs in ap 2024 Railway Recruitment Board Indian Railway Jobs 2024 Railway Re
Peoples Motivation

RRB Recruitment: రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 

దేశంలోని నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే (Indian Railway) శుభవార్త చెప్పింది. ఆయా విభాగాల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు ఇదో మంచి అవకాశం. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 03/ 2024) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29 వరకు కొనసాగనుంది. రెండు దశల పరీక్షల అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

Railway jobs telugu Railway Jobs 2024 Railway Jobs apply online Railway Jobs in ap 2024 Railway Recruitment Board Indian Railway Jobs 2024 Railway Recruitment 2024 Apply online Ap Railway Jobs apply online

RRB REGIONS

అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్ పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్కతా, మాల్టా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్జ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.

ప్రకటన వివరాలు

1. కెమికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ 17 పోస్టులు (ఆర్ఆర్బీ గోరఖ్పూర్ మాత్రమే)

2. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 7,951

అర్హత

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

విభాగాలు

కెమికల్ అండ్ మెటలర్జికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ తదితరాలు.

వయోపరిమితి

01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.

పే స్కేలు 

జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ 5.35,400.

కెమికల్ సూపర్వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రిసెర్చ్: రూ.44,900.

ఎంపిక విధానం

స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టేజ్-1 పరీక్ష సబ్జెక్టులు, మార్కులు: మ్యాథ్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), జనరల్ సైన్స్ (30 ప్రశ్నలు- 30 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 100. వ్యవధి: 90 నిమిషాలు.

స్టేజ్-2 పరీక్ష సబ్జెక్టులు, మార్కులు: జనరల్ అవేర్నెస్ (15 ప్రశ్నలు- 15 మార్కులు), ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ (15 ప్రశ్నలు- 15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), బేసిక్స్ అఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ (10 ప్రశ్నలు - 10 మార్కులు),

టెక్నికల్ ఎబిలిటీస్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య: 150. వ్యవధి: 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎన్ఎం/ మహిళలు/ ట్రాన్స్ జెండర్లకు రూ.250.

దరఖాస్తు ప్రక్రియ

ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 30.07.2024.

ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 29.08.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 30.08.2024 నుంచి 08.09.2024 వరకు 

ముఖ్యాంశాలు

  • దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
  • ఈ ప్రకటన ద్వారా 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ ఖాళీలు భర్తీ కానున్నాయి.
  • ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 29 వరకు కొనసాగనుంది.
  • రెండు దశల పరీక్షల అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

Notification

Official Website

Online application

Comments

-Advertisement-