-Advertisement-

SSC JOBS: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 ఉద్యోగాలు

Ssc jobs telugu Ssc jobs for graduates SSC jobs list SSC jobs list with Salary SSC gov in SSC GD SSC CGL SSC login Inter jobs Govt jobs TS TET TS DSC
Peoples Motivation

SSC JOBS: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 ఉద్యోగాలు 

న్యూఢిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)... దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో/ విభాగాల్లో/ సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Ssc jobs telugu Ssc jobs for graduates SSC jobs list SSC jobs list with Salary SSC gov in SSC GD SSC CGL SSC login Inter jobs Govt jobs TS TET TS DSC

ఉద్యోగ ఖాళీల డిపార్ట్మెంట్ పేరు

సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్,

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ఫ్రారెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్,

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్,

డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్,

డిపార్ట్మెంట్ అఫ్ వాటర్ రిసోర్సెస్,

రివర్ డెవలప్మెంట్ అండ్ రెజువెనేషన్,

ఇండియన్ మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్,

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్,

మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెర్నల్ అఫైర్స్,

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తదితరాలు.

వివరాలు

1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి (గ్రూప్-బి, నాన్-గెజిటెడ్)

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి (గ్రూప్-సి)

మొత్తం ఖాళీల సంఖ్య: 2006.

అర్హత

ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

వయోపరిమితి

01-08-2024 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 ఏళ్ల వయో సడలింపు ఇచ్చారు.

ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

ప్రశ్నపత్రం

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (100 ప్రశ్నలు- 100 మార్కులు). ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్/ హిందీ మాధ్యమంలో ఉంటాయి.

పరీక్ష వ్యవధి

2 గంటలు. మొత్తం మార్కులు: 200.

దరఖాస్తు రుసుము

రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

దరఖాస్తు విధానం

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 26.07.2024 నుంచి 17.08.2024 వరకు..
  • ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17.08.2024.
  • ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 18.08.2024.
  • దరఖాస్తు సవరణ తేదీలు: 27.08.2024 నుంచి 28.08.2024 వరకు
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: అక్టోబర్/ నవబర్, 2024.

ముఖ్యాంశాలు

దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

Notification

Online application

Comments

-Advertisement-