-Advertisement-

Tholi Ekadashi: నేడు తొలి ఏకాదశి

Tholi Ekadashi Mukkoti ekadashi Vaikuntan ekadashi Tholi Ekadashi importance General News telugu Telugu daily news Trending news Intresting news telug
Peoples Motivation

Tholi Ekadashi: నేడు తొలి ఏకాదశి

  • హిందువుల తొలి పండుగ
  • కొత్తగా పెళ్లి అయిన జంటలకు పెళ్లి ముస్తాబు
  • నోరూరించే పిండి వంటలు

Tholi Ekadashi Mukkoti ekadashi Vaikuntan ekadashi Tholi Ekadashi importance General News telugu Telugu daily news Trending news Intresting news telug

పీపుల్స్ మోటివేషన్ డెస్క్:-

మన మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి. ఈ పండగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే పండగ ఇది. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. 

తొలి ఏకాదశి:-

ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు.ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందని పెద్దల నమ్మకం.కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందని పురాణాలు చెబుతుంటాయి.

హిందువుల తొలి పండగ:--

నాటి నుంచి ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఇదే..తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత.

పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముస్తాబు:

కొత్తగా పెళ్లి అయిన వారిని హిందూ సాంప్రదాయ ప్రకారం ఆషాడమాసం రాగానే పెళ్లి కూతురు తల్లిదండ్రుల ఇంటికి తీసుకొని వెళ్తారు . ఒకే ఇంట్లో ఆషాడమాసంలో కొత్తజంటలు కలసి ఉండరాదని సాంప్రదాయ ఆచారం ఈనాడు కూడా కొంతమంది నిర్వహిస్తుంటారు. తొలి ఏకాదశినాడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురును వారు వారి ఇంటిదగ్గర పెళ్లి ముస్తాబు చేస్తారు . ఎవరు స్తోమత తగ్గ వారింట్లో పిండి వంటలు తయారు చేసుకుని ముత్తైదువులను పిలిచి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఆచారం పూర్వం నుండి వస్తుందని పెద్దలు తెలపడం జరిగింది.

Comments

-Advertisement-