Muchumarri Missing Case: ముచ్చుమర్రి బాలిక మిస్సింగ్ ఘటనపై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
Muchumarri Missing Case: ముచ్చుమర్రి బాలిక మిస్సింగ్ ఘటనపై కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
నంద్యాల, జులై 16 (పీపుల్స్ మోటివేషన్):-
గత వారం రోజులుగా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక ( Muchumarri girl ) పై అత్యాచారం, హత్య ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. నిందితులతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కొత్త విషయాన్ని రాబట్టారు. దీంతో నిందితుల సంఖ్య ఐదుకు చేరుకుంది.
గత వారం రోజుల క్రితం బాలికను ముగ్గురు మైనర్లు (Minors) అత్యాచారం చేసి, చంపేసి హంద్రీనివా (Handri Canal) కేసీ కెనాల్‌లో పడేశారు. తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. అయితే బాలిక ఆచూకి కోసం వారం రోజులుగా కెనాల్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ , గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా బాలిక ఆచూకిని గుర్తించలేక పోయారు.
బాలికను పూడ్చిపెట్టామని నిందితులు మరోసారి మాటమార్చడంతో పోలీసులు (Police) బుల్‌డోజర్లతో ఆ ప్రాంతాన్ని గాలించిన ఫలితం రాలేదు. అయితే నిందితులకు సంబంధించిన మరో ఇద్దరిని అదుపులోకి విచారించిన పోలీసులకు మరో షాకింగ్ విషయం బయటపడింది. బాలిక మృతదేహాన్ని కేసి కెనాల్ నుంచి తీసి పుట్టితో శ్రీశైలం రిజర్వాయర్ మధ్య వరకు తీసుకెళ్లి బండరాళ్లు కట్టి పడేశారని దీంతో పోలీసులు శ్రీశైలం రిజర్వాయర్ (Srisailam Reservaior) లో గాలింపు మొదలు పెట్టారని ఆయన తెలిపారు. బాలిక ఆచూకిని కనుగొనేంతరకు అత్యాధునిక, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్‌కెమెరా , అండర్ వాటర్ స్కానర్‌ను ఉపయోగించి గాలింపు కొనసాగుతుందని అన్నారు. నిందితులను, వారి ఇద్దరు బంధువులను అరెస్టు చేశామని ఆయన వివరించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ (SP Adiraj Singh) మీడియా సమావేశంలో సంచలన విషయాన్ని వెల్లడించారు.