-Advertisement-

Trains: తప్పునున్న ఇబ్బందులు సికింద్రాబాద్-గోవా మధ్య కొత్త రైలు..!

Secunderabad to goa trains ticket price Secunderabad to goa trains today Secunderabad to goa trains timings Hyderabad to Goa train ticket cost
Janu

Trains:తప్పునున్న ఇబ్బందులు సికింద్రాబాద్-గోవా మధ్య కొత్త రైలు..!

  • సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడంతో సీట్లు దొరక్క ఇబ్బందులు....
  • ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రితో ప్రస్తావించిన కిషన్ రెడ్డి....
  • సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్....
  • త్వరలో సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలు....

పని ఒత్తిడిని తగ్గించుకుని కొన్ని రోజులు అలా చిల్ అవుదామని అందరూ అనుకుంటుంటారు. మార్పులేని జీవనశైలి నుంచి తప్పించుకోవాలని కోరుకుంటారు. 

అల సుదూర ప్రాంతానికి వెళ్లి కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని భావిస్తారు. ప్రస్తుతం యువత ఈ విషయంలో గోవాను ముందుగా ఎంపిక చేసుకుంటోంది. అక్కడ బీచ్ లో సరదాగా గడపాలని, విందులు, విన్యాసాలను చేసేందుకు ఆసక్తి చూపుతోంది. అలాంటి వారికి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రా ప్రాంత యువతకు రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది.

ఇది కాకుండా కాచీగూడ – ఎలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి మార్చి 16, 2024 నాడు లేఖ రాయడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆలస్యం అయ్యింది. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోడీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసి మళ్ళీ గుర్తు చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. దీంతో సికింద్రాబాద్- వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్సప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డ్మ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుంది.

Comments

-Advertisement-