Pillalamarri: మళ్లీ జీవం తెర్చుకోనాన్న పిల్లలమర్రి.. టచ్ చేస్తే భారీ జరిమానా..!
Pillalamarri: మళ్లీ జీవం తెర్చుకో నన్న వస్తుంది పిల్లలమర్రి.. టచ్ చేస్తే భారీ ట్రీ జరిమానా..!
- 700 ఏండ్ల నాటి మహావృక్షానికి పునరుజ్జీవం..
- వచ్చే వారమే సందర్శకుల కోసం రీఓపెన్..
- పిల్లలమర్రి చెట్టును ముట్టుకుంటే రూ.5వేలు జరిమానా..
మహబూబ్ నగర్, జులై 09 (పీపుల్స్ మోటివేషన్):-
అప్పటి నుంచి దాన్ని కాపాడేందుకు అటవీశాఖ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దాదాపు ఆరున్నరేళ్ల తర్వాత పిల్లలమర్రి కొత్త పుంతలు తొక్కుతూ సందర్శకులకు రా.. రామ్మంటూ పిలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులోని ప్రసిద్ధ చెందిన మహావృక్షం మళ్లీ జీవం పోసుకుంది. 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మహావృక్షం 2018లో నేలకొరిగి చెదలు పట్టి, కొత్త ఊడలు రాక నిర్జీవంగా మారింది.
దీంతో 2018 నుంచి పిల్లలమర్రి సందర్శనపై విధించిన నిషేధాన్ని వచ్చే వారం నుంచి ఎత్తివేసి సందర్శకులను అనుమతిస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయని చెట్టును ఎవరైనా ముట్టుకుంటే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించారు.ఇందుకోసం గార్డులను కూడా నియమించామని తెలిపారు. అలాగే పరిసర ప్రాంతాన్ని సుమారు రూ.50 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. చిన్న పిల్లలు ఆడుకునేందుకు పార్కు, వాకింగ్ ట్రాక్, యోగా షెడ్, ఆర్వీ ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించారు.
పిల్లలమర్రిలో భాగమైన మహావృక్షం నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని రెమ్మలు నేలను తాకినట్లయితే, అవి కూడా చెట్లుగా పెరుగుతాయి. అయితే గతంలో ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో కొందరు మహావృక్షం కొమ్మలను ఎక్కి వాటిమీద పేర్లు చెక్కడం, చిన్నచిన్న ఊడలను తుంచడం చేస్తూ వచ్చారు. దీంతో.. మహావృక్షానికి చీడ ఆవహించింది. దీని ఫలితంగా కొమ్మలు, ఊడలు ఊడిపోతూ.. చెదలు కూడా తోడవడంతో చెట్టు ఎండిపోతూ కూలిపోయే స్థితికి చేరుకుంది. ఈనేపథ్యంలో 2018 సెప్టెంబర్ నుంచి పిల్లలమర్రిని సందర్శించేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ మహావృక్షాన్ని సంరక్షించే బాధ్యతను పర్యాటక శాఖ నుంచి మహబూబ్ నగర్ అటవీశాఖకు అప్పగించారు. అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ఫండ్కు మహావృక్ష సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. తొలుత చెదపురుగుల నివారణపై అటవీ సిబ్బంది దృష్టి సారించారు. మహావృక్షానికి సెలైన్ బాటిళ్ల ద్వారా క్రిమిసంహారక మందులను ఎక్కించారు. కొన్ని నెలల పాటు ఈ చికిత్స అందించిన తర్వాత, ప్రభావితమైన కొమ్మలను ఒక్కొక్కటిగా తొలగించారు. తర్వాత మహావృక్షం నుంచి బలంగా దిగేందుకు రెండు అడుగులు, పది అంగుళాల పైపులు ఏర్పాటు చేశారు. ఆ పైపు ద్వారా నీరు భూమిలోకి వెళ్లేలా చేశారు. పొదుగులకు సూర్యరశ్మి వచ్చేలా పైపులకు రంధ్రాలు కూడా చేశారు.
సుమారు మూడున్నరేళ్లుగా మొక్కలకు ఎరువులు, మందులు వేయడంతో అవి బలంగా పెరిగాయి. పైపులను పగులగొట్టి భూమిలోకి చొచ్చుకుపోయి మహావృక్షాన్ని ఆదుకున్నారు. అలాగే ఈదురు గాలులు, భారీ వర్షాలకు పిల్లలమర్రి చెట్టు దెబ్బతినకుండా మధ్యలో ఉన్న పెద్ద పెద్ద కొమ్మలకు సపోర్టుగా రెండున్నర అడుగుల వెడల్పు, 6 అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తులో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. చెట్టు బలంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఎరువులు వేశారు. అధికారులు కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పాలమూరును టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లమలలో పర్యటించారు. ఆరున్నర సంవత్సరాల తర్వాత, మేము ఈ వారంలో పిల్లలమర్రిని తిరిగి ప్రారంభిస్తున్నాము. పిల్లలమర్రి చెట్టు పునఃప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సి ఉండగా, బిజీ షెడ్యూల్ కారణంగా రావడం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.