-Advertisement-

TS TET: ఏడాదికి రెండుసార్లు టెట్.. ఉత్తర్వులు జారీ.

TS TET Result 2024 TS TET results TS TET Hall Ticket TS TET official website TS TET Hall Ticket 2024 TS TET Syllabus Ts tet results 2024 telugu news
Janu

TS TET: ఏడాదికి రెండుసార్లు టెట్.. ఉత్తర్వులు జారీ.

  • ప్రతి సంవత్సరం జూన్‌లో ఓసారి, డిసెంబర్‌లో మరోసారి నిర్వహించాలని నిర్ణయం...
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విద్యాశాఖ...
  • టెట్ మార్కులతో డీఎస్సీలో వెయిటేజీ..

ఏడాదికి రెండుసార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఓసారి, డిసెంబర్ నెలలో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 


ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాయడానికి అవకాశం కల్పించనున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వనున్నారు. గతంలో, నేషనల్‌‌‌ కౌన్సిల్‌‌‌ ఫర్‌‌‌ టీచర్‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌ (ఎన్సీటీఈ) ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం టెట్ గడువును జీవితకాలానికి పెంచింది. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో కేవలం ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తమ స్కోర్ పెంచుకునేందుకు మాత్రం రాసుకోవచ్చు.

Comments

-Advertisement-