Vasanthi missing Case: ముచ్చుమర్రిలో బాలిక జాడ ఎక్కడా..? వారం రోజులైనా వీడని సస్పెన్స్
Vasanthi missing news
Muchumarri girl inciden
Current Affairs Quiz
Daily current Affairs pdf
Free Current Affairs
Intresting news
General News telugu
By
Peoples Motivation
Vasanthi missing Case: ముచ్చుమర్రిలో బాలిక జాడ ఎక్కడా..? వారం రోజులైనా వీడని సస్పెన్స్
- ముచ్చుమర్రిలో బాలిక ఘటనలో వీడని సస్పెన్స్
- పోలీసుల అదుపులో మైనర్ బాలలు, వారి తల్లిదండ్రులు
- పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మైనర్ బాలురు
- బాలిక మృతదేహం కోసం 7వ రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు
తొమ్మిది సంవత్సరాల చిన్నారి ఆచూకీ వారం రోజులైనా లభించలేదు..నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం ముచ్చుమర్రి లో బాలిక మిస్సింగ్ ఘటనలో సస్పెన్స్ వీడటం లేదు. ముచ్చుమర్రిలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక మృతదేహం కోసం వారం రోజులైనా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 7వ తేదీన బాలిక(9) అదృశ్యమైంది. పోలీసుల అదుపులో మైనర్ బాలులు, తల్లిదండ్రులు ఉన్నారు. అయితే.. మొదట గ్రామ సమీపంలోని స్మశానంలో పడేశామని తెలిపారు. తర్వాత హంద్రీనీవా కాలువలో మృతదేహాన్ని పడేశామన్న మైనర్ బాలురు. తాజాగా బాలిక మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశామని మైనర్ బాలుని తండ్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కృష్ణా నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. పూటకో మాట చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు మైనర్ బాలురు. డీఐజీ స్థాయి అధికారి కేసును పర్యవేక్షించినా బాలిక (9) మృతదేహం ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బాలిక మృతదేహం అయిన అప్పజెప్పాలని బాలిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. మృతదేహం దొరక్కపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని విలపిస్తున్నారు. మైనర్లు కాబట్టి శిక్ష తగ్గించకూడదని.. కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇదిలా ఉంటే.. నంద్యాలలో నేడు పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో బాలిక(9) ఘటనను నిరసిస్తూ చలో ముచ్చుమర్రి కి పిలుపునిచ్చారు నంద్యాల వీఆర్పీఎస్ నాయకులు. నంద్యాల నుంచి ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్న వీఆర్పీఎస్ శ్రేణులు.. నిందితుల నుంచి మృతదేహం ఆచూకీ తొందరగా రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments