AP GOVT: నామినేటెడ్ పోస్టుల భర్తీకి వేళాయే.. పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
AP GOVT: నామినేటెడ్ పోస్టుల భర్తీకి వేళాయే.. పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
• ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ...
• వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్...
• శాప్ ఛైర్మన్‌గా రవి నాయుడు...
• 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్...
• సామాన్య కార్యకర్తలకు దక్కిన పదవులు...
• జనసేనకు 3, బీజేపీకి ఒక పోస్టు కేటాయింపు...
ఆంధ్రప్రదేశ్ లో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మొత్తం 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. అలాగే ఒక కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్, వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది.
ఇక ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, శాప్ ఛైర్మన్‌గా రవి నాయుడిని, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్‌ను ప్రభుత్వం నియమించింది. 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పదవులు ఇచ్చింది. ఇందులో ఒక క్లస్టర్ ఇంఛార్జ్‌కు ఏకంగా ఛైర్మన్ పదవి దక్కడం గమనార్హం. అలాగే మరో ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు కూడా పదవులు దక్కాయి. ఇక తాజాగా ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం దక్కింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు.
పలు కార్పొరేషన్లకు చైర్మన్ల వివరాలు
ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ – కొనకళ్ల నారాయణ
వక్ఫ్ బోర్డు – అబ్దుల్ అజిజ్
శాప్ – రవి నాయుడు
హౌసింగ్ బోర్డు – బత్తుల తాతయ్య బాబు
20 సూత్రాల అమలు కమిటీ – లంకా దినకర్ (బీజేపీ)
ఏపీ ట్రైకార్ – బొరగం శ్రీనివాసులు
ఏపీ మారిటైమ్ బోర్డు – దామచర్ల సత్య
ఎస్ఈఈడీఏపీ – దీపక్ రెడ్డి
విత్తనాభివృద్ధి సంస్థ – మన్నె సుబ్బారెడ్డి
ఏపీఐఐసీ – మంతెన రామరాజు
మార్క్ ఫెడ్ – కర్రోత్తు బంగార్రాజు
ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నూకసాని బాలాజీ
పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – నందం అబద్దయ్య
ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – పీలా గోవింద సత్యనారాయణ
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – పిల్లి మాణిక్యాలరావు
ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ – పీతల సుజాత
ఏపీ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ – తోట మెహర్ సీతారామ సుధీర్(జనసేన)
ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ – తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన)
ఏపీ టీఐడీసీవో – వేములపాటి అజయ్ కుమార్ (జనసేన)
ఏపీటీపీసీ – వజ్జ బాబురావు
ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ – పీఎస్ మునిరత్నం