-Advertisement-

AP TET: డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

AP tet hall tickets download AP tet 2024 aptet.apcfsin AP tet hall ticket number forgot aptet.apcfss.in/ results AP tet notification 2024 pdf download
Peoples Motivation

AP TET: డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

ఏపీ టెట్ హాల్ టికెట్లు ఈనెల 22 నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది హాజరుకానున్నారు. ఈనెల 19 నుంచి మాక్ టెస్టులు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 4 తర్వాత నుంచి ప్రైమరీ 'కీ'లను విడుదల చేసి, 5 నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ కీ, నవంబర్ 2న తుది ఫలితాలు ప్రకటిస్తారు.

AP tet hall tickets download AP tet 2024 aptet.apcfsin AP tet hall ticket number forgot aptet.apcfss.in/ results AP tet notification 2024 pdf download

ఏపీ టెట్-2024 పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ టెట్ పరీక్షలకు సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు.లక్షలమంది అభ్యర్థులు దీనిలో పాల్కొననున్నారు. టెట్ పరీక్షలను రెండు సెషన్లలో 18 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

పరీక్ష ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్‌ 4 నుంచి వరుసగా ప్రైమరీ కీ లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలియచేసారు. జాప్యం చేయకుండా చేయకుండా ఫలితాలు వెల్లడి చేయడం,ఫలితాల పట్ల అభ్యంతరములుంటే వాటిని స్వీకరించడం చేయనున్నారు. అభ్యర్థులు అక్టోబర్‌ 5 నుంచి టెట్ కీ పై తమ అభ్యంతరాలను తెలపవచ్చు. అక్టోబర్‌ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. అభ్యంతరములను పూర్తిగా పరిశీలించి ,పూర్తిగా నివృత్తి చేస్తారు. చివరగా నవంబర్‌ 2న తుది ఫలితాల విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు తప్పక సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీ.హెచ్ (ఫిజికల్ హాండీకాప్ట్), ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ..

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే టెట్ స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇదేకాక అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు కొత్తగా రిటైర్మెంట్ పొందిన వారి స్థానాలలో ఖాళీల కోసం మరోసారి కూడా టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జులై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. లక్షలమంది అభ్యర్థులు తమ భవిష్యత్తు కై తీవ్ర శ్రమ పడుతున్నారు.సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పేపర్‌ 1-ఎ కు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌1-బి కు 2,662 మంది అప్లై చేసుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులు పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నారు.లాంగ్వేజ్ మరియు ఇతర సబ్జెక్టులవారికి ఈ పరీక్షలు కలిపి నిర్వహిస్తున్నారు.

https://aptet.apcfss.in/

Comments

-Advertisement-