Army Public School: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Army Public School: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా ఆర్మీ పబ్లిక్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» పోస్టుల వివరాలు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పీఆర్టీ(ప్రైమరీ టీచర్).
» సబ్జెక్టులు:
బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు.
» అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎస్ఈడీ, బీఈ ఎస్ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్, టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలి.
» వయసు:
01.04.2024 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.
» ఎంపిక విధానం:
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యం, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.09.2024.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.10.2024.
» పరీక్షల తేదీలు: 23.11.2024, 24.11.2024.
» ఫలితాలు వెల్లడించే తేదీ: 10.12.2024.
» తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
» తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లున్న ప్రాంతాలు: సికింద్రాబాద్(ఆర్కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ.
>> మిగతా సమాచారం కోసం కింది వెబ్సైట్ చూడగలరు.. https://awesindia.com