Railways: రైల్లో ప్రయాణించే వీరికి టిక్కెట్లు అవసరం లేదు తెలుసా..!
Railways: రైల్లో ప్రయాణించే వీరికి టిక్కెట్లు అవసరం లేదు తెలుసా..!
>> రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణం..
>> రైళ్లలో సులభంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు..
>> రైలు ప్రయాణాల్లో కొన్ని పదార్థాలను తీసుకువెళ్లకూడదు..
>> ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ఇండియన్ రైల్వే...
దేశవ్యాప్తంగా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ.. ఇండియన్ రైల్వే వేలాది రైళ్లను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఇండియన్ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ను కలిగి ఉంది. ఇండియన్ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్వర్క్లో ఒకటిగా పేరు పొందింది. ఈ నెట్వర్క్ దేశంలోని సరిహద్దు ప్రాంతాలను పెద్ద మెట్రోలతో కలుపుతుంది. ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇండియన్ రైల్వే అనేక రూల్స్ పెట్టింది. అందులో.. రైలులో ప్రయాణించేటప్పుడు చిన్న పిల్లలకు టిక్కెట్లు తీసుకోవలసిన అవసరం లేదని ఇండియన్ రైళ్లలో ప్రయాణించే వారికి తెలుసు. అయితే.. నిర్ణీత వయోపరిమితిలోపు పిల్లలు మాత్రమే రైలులో ఉచితంగా ప్రయాణించగలరు. అయితే.. ఏ వయస్సు వరకు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రైళ్లలో వారికి మాత్రమే ఉచితం...
ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం, 1 నుండి 4 సంవత్సరాల మధ్య పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పిల్లలకు ఎలాంటి రిజర్వేషన్ ఛార్జీ లేదు. అలాగే.. 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ తీసుకోవాలి. 5 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లల కోసం సీటు లేకుండా ఉంటే.. హాఫ్ టికెట్ కొనవలసి ఉంటుంది. ఒకవేళ సీటు రిజర్వేషన్ కోసం టికెట్ కోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాలి.
ఆ పదార్థాలను తీసుకువెళ్లకూడదు...
ఇండియన్ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇండియన్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీరు అగ్ని, పేలుడు పదార్థాలకు సంబంధించి తీసుకువెళ్లకూడదు. అలాగే.. రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు గట్టిగా మాట్లాడొద్దు.