ఏమీ కొనలేం... తినలేం
ఏమీ కొనలేం... తినలేం
• నింగినంటిన నిత్యవసర వస్తువులు
• పెరగని ఆదాయం.. అధిక ఖర్చులు.
• చేతికందని విద్య.... వైద్యం
• సగటు మానవుడి జీవితం ఇదే!!!
నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్య, పేద ప్రజలు పప్పన్నం తినే పరిస్థితులు లేకుండా పోతోంది. పప్పులు, బియ్యం, ఉల్లిగడ్డలు, నూనెలు సామన్యులకు భారంగా మారుతున్నాయి. మరోవైపు కూరగాయాలు ధరలు కూడా కొనలేని స్థితికి చేరుకున్నాయి. రోజురోజుకూ నిత్యావసర ధరలు అధికంగా పెరుగుతుండటంతో కొనలేకపోతున్నామని, పచ్చడి మెతుకులు తినాలన్నా భారంగా మారిందని ప్రజలు ఆవేదన చెందు తున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం నిత్యవసర వస్తు వులు ధరలను అదుపు చేయడంలో విఫలం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక లీటర్ పామాయిల్ రూ.120, వేరుశనగ రూ.160, పప్పులు రూ.180, చింతపండు రూ.160,,ఎండు మిరప రూ.250, చక్కెర రూ.45, బెల్లం రూ.70. ఉల్లిపాయలు 80 ఇలా రేట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయని అంటున్నారు . మరోవైపు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని ఆవేదన చెందుతున్నారు. రూ.500 పెట్టుకొని బజారుకు వెళితే కనీసం ఐదు రకాల కూరగాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు. చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేయాలికూలీ నాలీ చేసుకొని సంపాదించుకున్నదంతా నిత్యావసర ధరలకే సరి పోతోంది. ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేయాలి. పచ్చడి మెతుకులు తినాలన్నా భారంగా మారు తోంది. పచ్చిమిర్చిని కూడా కొనలేక పోతు న్నారు. పెరుగు తున్న ధరలను ప్రభు0త్వం నియం త్రించాలిని మహిళలు వాపోతున్నారు. సబ్సీడితో అందివ్వాలిపెరిగిన నిత్యావసర ధరలను కొనలేకపోతున్నాం. ప్రభుత్వమే సబ్సీడీతో పంపిణీ చేయాలి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా నిత్యావసర ధరలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. ఉప్పు, పప్పు దినులు, చింత పండు, బెల్లంతో కాయగూరలు అన్ని రకాల వస్తు వుల ధరలు అమాంతంగా పెరిగాయి. పెరిగిన రేట్ల ను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.-
మన రాష్ట్రంలో సగటు వ్యక్తి జీవనం రోజురోజుకూ మరింత భారంగా మారుతోంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాలో పోలిస్తే మన రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, వైద్య ఖర్చులు బాగా పెరిగాయి. వాస్తవానికి ధరల జాతీయ సగటు దాదాపు వంద శాతం పెరిగినట్లు కనిపిస్తున్నా ప్రాంతాలవారీగా విడివిడిగా చూస్తే కొన్నిచోట్ల దాదాపు 200 శాతం పెరిగినవి కూడా ఉన్నాయి.నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఒక కుటుంబంలో మానవుని జీవితం అధ్వానంగా ఉంది ఎందుచేత అంటే ప్రతి కుటుంబంలో విద్య వైద్యం కావాలి మనకు వచ్చిన ఆదాయం తక్కువ ఖర్చు అధికం!! ప్రతి ఒక్కరికి జీవనశైలిలో ఏదో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సంఖ్య ఈనాడు సమాజంలో ఎక్కువగా ఉంది! వాటిని అధికమించి సామాన్య మానవుడు సంసారాన్ని నడుపుతున్నాడు. తెల్లారిగానే టీ తో మొదలై టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి డిన్నర్ ఇవి కాకుండా చదువుకునే పిల్లలు వాళ్లకు కావాల్సిన వస్తువులు కొనికెవ్వడం పెద్దలు ఉంటే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి వైద్యం ఖర్చులు ఇలా చెప్పకపోతే సగటు జీవి బ్రతుకు ఇంతే పెద్దలు చెప్తుంటారు సాగరాన్ని వీద వచ్చు కానీ సంసారాన్ని వీదలేము.
ఉదయం నుండి రాత్రి వరకు కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటాది వాటిని ఎదుర్కొని నిలబడిన వాడే మనిషి అది అందరూ అర్థం చేసుకోండి... మన జేబులో పదివేలు ఉంటే సంతోషంగా బ్రతికేది మనమే లేనప్పుడు కూడా బ్రతికేది మనమే అదే మనిషి జీవితం రహస్యం!!! ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుతం సమాజంలో మార్పు అవసరం ప్రస్తుతం వస్తున్న ఆదాయం కుటుంబం ఖర్చులకు సరిపడిన ఆదాయం.... వీటిని అధిగమించి పోరాడే వాడే నిజమేనా మనిషి!??!