Gold Price: రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు .. రూ. 78 వేలు సరికొత్త రికార్డు
Gold rates telugu
gold rates near nandyala, andhra pradesh
today gold rate (22 carat)
1 gram gold rate today
Today gold rate kurnool malabar
Gold rate
By
Peoples Motivation
Gold Price: రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు .. రూ. 78 వేలు సరికొత్త రికార్డు
• 78 వేల ఆల్‌టైం హైను తాకిన పుత్తడి ధర...
• కిలో వెండిపై రూ. 1000 పెరుగుదల...
• కొనుగోళ్లు పెరగడం ధరల పెరుగుదలకు కారణం...
• దీపావళి నాటికి బంగారం ధర రూ. 80 వేలను తాకే అవకాశం...
బంగారం ధరలు రికార్డు స్థాయిలో అలుపెరగకుండా పరుగులు పెడుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 78 వేల ఆల్‌టైం హై నమోదు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై నిన్న రూ. 400 పెరిగి రూ. 78 వేలకు చేరుకుంది. బుధవారం రూ. 77, 800 ముగిసిన పుత్తడి ధర నిన్న మరో రూ. 400 పెరిగి రూ. 78,250 మార్కును దాటింది. బంగారం ధరతోపాటు పెరిగే వెండిపైనా కిలోకు రూ. 1000 పెరిగి రూ. 94 వేలను తాకింది.
రూ. 80 వేల మార్కు...
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు వడ్డీ రేట్లను తగ్గించేందుకు కేంద్ర బ్యాంకులు ముందుకు రావడమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడం కూడా ధరల పెరుగుదలకు మరో కారణమని చెప్తున్నారు. దసరా, దీపావళి వేళ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని, రూ. 80 వేల మార్కును కూడా తాకవచ్చని విశ్లేషిస్తున్నారు.
Comments