Cancers: ఈ అలవాట్ల ఉంటే మానుకోండి.. లేదా కాన్సర్ ముప్పు తప్పదు!!
Cancers: ఈ అలవాట్ల ఉంటే మానుకోండి.. లేదా కాన్సర్ ముప్పు తప్పదు!!
>> యువతకు సరదాగా అలవాటై.. వ్యసనంగా మారుతున్న పాన్ మసాలాలు.
>> బానిసలుగా మారుతున్న యువత...
>> అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు..
>> నికోటిన్, ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
సరదాగా అలవాటై వ్యసనంగా మారుతున్న గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు.. ఈ నేపథ్యంలో వీటికి అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. పొగాకుతో తయారు చేస్తున్న గుట్కా, పాన్ మసాలా, ఖైనీల్లో ఉండే నికోటిన్ తోపాటు అనేక ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇకపోతే చాలామంది పడుకునే సమయంలో గుట్కాను దవడ భాగంలో పెట్టుకొని నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో పుండుగా ఏర్పడి ఆ భాగంలో క్యాన్సర్ గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఇకపోతే ఈ మధ్య మహిళల్లో కాస్త రొమ్ము క్యాన్సర్ల సంఖ్య పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాలు చూస్తే.. ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, ఇంకా అధిక బరువు లాంటివి ఇందుకు కారణమవుతున్నాయి. ప్రస్తుత కాలంలో 30 నుండి 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికి ఒకసారి మేమోగ్రామ్, పాప్స్మియర్ పరీక్షలు చేయించుకుంటే ఈ క్యాన్సర్లను నివారించొచ్చని వైద్యులు తెలుపుతున్నారు.క్యాన్సర్లకు పొగాకు సంబంధిత ఉత్పత్తులే తల, మెడ, ఊపిరితిత్తుల కాన్సర్లకు ప్రధాన కారణమని పేర్కొంటున్నారు.
60% క్యాన్సర్లు దాడి చేసేది ఈ అలవాటు వల్లనే. ఇకపోతే ఎక్కువ శాతం గొంతు క్యాన్సర్లకు పొగాకు పదార్థాలే అసలైన కారణం. వీటి నుంచి బయట పడాలంటే.. ఎక్కువ ఉప్పు వాడటం, పదేపదే వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం, పొగ, మద్యం, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా నమలడం లాంటి అనేక వాటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే రెడ్ మీట్ కు బదులు చేపలు, చికెన్, గుడ్లు తీసుకోవాలి. అలాగే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా నిత్యం ఒక గంట వ్యాయామానికి కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి.