-Advertisement-

#CURRENT AFFAIRS: 19 సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్

Current Affairs Telugu Current Affairs PDF Today Current Affairs Current Affairs news TS TET APPSC GROUP 2 TS DSC AP TET AP DSC SSC JOBS TENTH JOBS
Peoples Motivation

CURRENT AFFAIRS: 19 సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అంకితభావం కలిగిన విద్యార్థులు మరియు పాఠకులందరికీ పీపుల్స్ మోటివేషన్ డైలీ కరెంట్ అఫైర్స్ ని అందజేస్తుంది..✍️

19 సెప్టెంబర్ 2024 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం:-

దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల జమిలి ఎన్నికలకు(వన్ నేషన్.. వన్ ఎలక్షన్/ఒకే దేశం, ఒకే ఎన్నికలు)కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టబోతోంది. ఒక దేశం, ఒకే ఎన్నికలు' అనే ఆలోచను 1980లలో మొదటిసారిగా ప్రతిపాదించారు. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ మే 1999లో తన 170వ నివేదికలో లోక్సభ తోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 8 సభ్యులతో కూడిన కమిటీనిఏర్పాటు చేసింది. ఏకకాల ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ తన విస్తృతమైన 18,626 పేజీల నివేదికను మార్చి 2024 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్కుకు సమర్పించింది. జమిలి ఎన్నికలపై జాతీయ లా కమిషన్ కూడా తన నివేదికను రూపొందించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలు కల్పించేలా రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్ సిఫారసు చేయనున్నట్టు తెలుస్తోంది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ప్రకారం, 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 32 పార్టీలు ఏకకాల ఎన్నికల భావనకు మద్దతు ఇచ్చాయి. అదనంగా, వార్తాపత్రికలలో ప్రచురించిన పబ్లిక్ నోటీసు పౌరుల నుండి 21,558 ప్రతిస్పందనలు వచ్చాయి. వీరిలో 80% మంది ప్రతిపాదనకు అనుకూలత వ్యక్తం చేశారు.

*****

ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ "ఎక్స్రేసీ వైరస్":-

కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్ సీ ((XEC Covid Variant)) యూరప్ విస్తరిస్తుంది. 2024, జూన్లో ఈ ఎక్స్రేసీ వేరియంట్ను తొలిసారి యూరప్లో గుర్తించిన అనంతరం యూకే, అమెరికా, డెన్మార్క్ , జర్మనీ, నెదర్లాండ్స్ లతో పాటు ఇతర దేశాలకు సైతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ వేరియంటు సబ్ లీనియేజ్ గా ఉన్న ఈ కొత్త వేరియంట్(ఎక్స్రేసీ హైబ్రిడ్)లో రకరకాల మ్యుటేషన్లు జ రుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. గతంలో ప్రపంచ దేశాలను వణికించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అయిన కేఎస్.1.1, కేపీ.3.3 తరహాలోనే ఈ కొత్త ఎక్స్రేసీ కేసులు కూడా వ్యాపిస్తున్నాయి. ఈ వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు 27 దేశాల నుంచి సేకరించిన 500 నమూనాల్లో ఎక్స్రేసీ వేరియంట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు.

లక్షణాలు:-

జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, వాసన తెలియక పోవడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఒళ్లు నొప్పులు లాంటి సాధారణ కొవిడ్ వైరస్ లక్షణాలు ఉంటాయి.

*****

వీనస్ ఆర్బిటర్ మిషన్ (వీఓఎం)- శుక్రయాన్:-

శుక్రగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్ (Venus Orbiter Mission (VOM)) కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి శుక్షయాన్ అని పేరు పెట్టబడింది. చంద్రుడు, మార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరం, శుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగం నేతృత్వంలో రూపుదిద్దుకునే వీనస్ ఆర్బిటర్ మిషన్ కింద ఒక స్పేస్ క్రాఫ్ట్ (వాహక నౌక) శుక్రగ్రహ కక్ష్యలో పరిభ్రమిస్తూ, శుక్రగ్రహ ఉపరితలాన్నీ, అంతర సరాన్నీ, శుక్రగ్రహ అంతర్భాగ అధ్యాయానికి, వాతావరణ పరిస్థితులను, శుక్రగ్రహం వాతావరణంపై సూర్యుడి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధన ప్రకారం, ఒకప్పుడు భూగ్రహంలాగే ఆవాసయోగ్యంగా ఉన్న శుక్రగ్రహం పై మార్పులు ఎందుకు చోటు చేసుకున్నాయి, కారణాల అన్వేషణ, భూమి మరియు శుక్ర గ్రహాల ఆవిర్భావం గురించిన విలువైన సమాచారం లభించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మిషన్ ను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా లభించే సమాచారం ఎన్నో జటిలమైన శాస్త్రపరమైన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుందని, తద్వారా అనేక నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఈ మిషన్ కు మొత్తం రూ.1236 కోట్లు కేటాయించింది.

*****

నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV-Soorya):-

నెక్స్ జనరేషన్ లాంచ్ వెహికల్ (సూర్య) కు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ, దానిని నిర్వహించడానికీ ఈ అంతరిక్ష నౌక ఉపయోపడనుంది. 2040 సంవత్సరానికల్లా చంద్రుని మీదకు భారతీయ వ్యోమగాములను పంపించాలన్న లక్ష్యాన్ని సాకారం అయ్యేందుకు ఈ నౌక కీలకపాత్రను పోషించనుంది. ప్రస్తుతం ఉన్న ఎలివిఎమ్ 3 తో పోలిస్తే ఒకటిన్నర రెట్ల అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ కన్నా మూడింతల పేలోడ్ లను మోసుకు పోయే సామర్థ్యం ఎన్వీఎల్వికి ఉంటుంది. NGLV ని తిరిగి ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండటంతో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడానికి ఖర్చు తగ్గుతుంది. ఈ రాకెట్ ను మండించడానికి పర్యావరణహిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడం ఈ కొత్త వాహక నౌక ప్రత్యేకత. ఎస్వీఎల్విని దిగువ భూకక్ష్యలో గరిష్టంగా 30 టన్నుల పిలోడ్ లను మోసుకుపోగలిగిలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి, ఇస్రో దగ్గర పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎల్విఎమ్ 3, ఎస్ఎస్ఎల్వి వాహక నౌకలు ఉన్నాయి. ఇవి 10 టన్నుల బరువు వరకూ బరువున్న కృత్రిమ ఉపగ్రహాలను భూ సమీప కక్ష్మ[Low Earth Orbit) లోకీ, 4 టన్నుల బరువున్న వాటిని భూ స్థిర కక్ష్మ [Geo-Synchronous Transfer Orbit) లోకి మోసుకుపోగల సామర్థాన్ని కలిగి ఉన్నాయి. ఎన్ఎల్వి ని మూడు దశల్లో (డి1, డి2, డి3) పరీక్షించనున్నారు. కేంద్రప్రభుత్వం దీనికి మొత్తం రూ.8240.00 కోట్లు కేటాయించింది.

*****

2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం:-

అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు చేసేందుకు సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని (బీఏఎస్) నిర్మించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రస్తుతమున్న లాంఛర్ సామర్థ్యాలతోనే 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తుంది. ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటుంది. ప్రస్తుతం, అమెరికా నేతృత్వంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మరియు చైనా నేతృత్వంలో టయాంగాంగ్ అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే భారతదేశానికి కూడా అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం (భారత్ అంతరిక్ష కేంద్రం) ఉంటుంది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ప్రారంభించాలని, 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపై కాలుపెట్టేలా చూడాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

*****

Current Affairs 2024 Current Affairs PDF Today Current Affairs Current Affairs news Current Affairs Quiz Current Affairs 2024 PDF Current Affairs of India Current Affairs MCQ

#కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్విజ్

1). 3వ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 ఎక్కడ నిర్వహించబడుతోంది?

(ఎ) ముంబై

(బి) చండీగఢ్

(సి) న్యూఢిల్లీ

(డి) జైపూర్

2). షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇటీవల తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?

(ఎ) నీరజ్ చోప్రా

(బి) నవదీప్ సింగ్

(సి) మను భాకర్

(డి) సూర్య కుమార్ యాదవ్

3). చంద్రయాన్-4 మిషన్ కోసం కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది?

(ఎ) 2,004.06 కోట్లు

(బి) 2,104.06 కోట్లు

(సి) 2,204.06 కోట్లు

(డి) 2,304.06 కోట్లు

4). ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజల సహాయ, పునరావాసం కోసం కేంద్రం ఎంత నిధులు కేటాయించింది?

(ఎ) 10,554 కోట్లు

(బి) 12,554 కోట్లు

(సి) 14,554 కోట్లు

(డి) 16,554 కోట్లు


5). నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

(ఎ) అనురాగ్ గార్గ్

(బి) రాజీవ్ కుమార్

(సి) అజయ్ శ్రీవాస్తవ్

(డి) కుల్దీప్ సిన్హా


సమాధానాలు:-

1. (సి) న్యూఢిల్లీ

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 19 నుండి 22 వరకు వరల్డ్ ఫుడ్ ఇండియా 3వ ఎడిషన్‌ను నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వం 2017 సంవత్సరంలో వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

2). (సి) మను భాకర్

పారిస్‌లో రెండు ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న మను భాకర్‌ను ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు.

3). (బి) 2,104.06 కోట్లు

చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత, ఇస్రో ఇప్పుడు చంద్రయాన్-4 మిషన్‌కు సిద్ధమవుతోంది. చంద్రయాన్-4 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది. మిషన్ యొక్క మొత్తం బడ్జెట్ ₹2,104.06 కోట్లు, ఇందులో అంతరిక్ష నౌక అభివృద్ధి, రెండు LVM3 ప్రయోగాలు, డీప్ స్పేస్ నెట్‌వర్క్ మద్దతు మరియు ప్రత్యేక పరీక్షలు ఉన్నాయి. వీనస్ ఆర్బిటర్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ మరియు నెక్స్ట్-జనరేషన్ లాంచ్ వెహికల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.    

4). (బి)12,554 కోట్లు

వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలకు రూ.12,554 కోట్లు మంజూరు చేసింది. అగ్నిమాపక సేవల విస్తరణ మరియు ఆధునీకరణ పథకం కింద, అగ్నిమాపక సేవలను విస్తరించడంలో మరియు బలోపేతం చేయడంలో ఐదు రాష్ట్రాలకు సహాయం చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ. 890.69 కోట్లను మంజూరు చేసింది.

5). (ఎ) అనురాగ్ గార్గ్

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఐపిఎస్ అధికారి అనురాగ్ గార్గ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. అతను హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. అనురాగ్ గార్గ్ ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ప్రధాన కార్యాలయంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.

Comments

-Advertisement-