TS DSC: డిఎస్సీ ఫలితాలు అప్పుడే
TS DSC: డిఎస్సీ ఫలితాలు అప్పుడే
తెలంగాణ రాష్ట్రంలో మొదటి డిఎస్సీ.. ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నా డిఎస్సీ అభ్యర్థుల కలకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తుంది. సెప్టెంబరు 6వ తేదీన డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల తుది 'కీ'ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినప్పటికీ ఫలితాలకు మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్) విడుదల మరింత ఆలస్యం కానుంది. దాంతో డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిసి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుది కీ విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా.. ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం.
సవరణలకు అవకాశం ముగిసినా...
డీఎస్సీ తుది కీ విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పులతడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీతో ముగిసింది. జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డీఈవోలకు పంపించాల్సి ఉంటుంది. కానీ, GRLను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.