-Advertisement-

Damini: అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? ముందస్తు హెచ్చరికలు.. ఈ యాప్‌ ద్వారా తెలుసుకోండి..?

Lightning india Lightning strike What causes lightning Lightning drawing Lightning cartoon Lightning Apple Lightning voltage Lightning strike on huma
Peoples Motivation

Damini: అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? ముందస్తు హెచ్చరికలు.. ఈ యాప్‌ ద్వారా తెలుసుకోండి..?

Lightning india Lightning strike What causes lightning Lightning drawing Lightning cartoon Lightning Apple Lightning voltage Lightning strike on human


ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేశంలో సంభవించే అత్యధిక మరణాలకు పిడుగులే కారణం. సహజంగా తుఫాన్లు, భూకంపాలు, భారీ వర్షాలు, వరదలు, గాలిదుమారాలు, వడగాలులను ప్రకృతి విపత్తులుగా పరిగణిస్తుంటాం. వర్షాలు పడుతున్న సమయంలో పిడుగులు పడడం సహజం. పిడుగును (lightning) ప్రకృతి విపత్తుగా ఎవరూ భావించరు. కానీ, అన్నింటికంటే పిడుగే అత్యంత ప్రమాదకారిగా ఎన్నోసార్లు నిరూపితమైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం పిడుగులతో ప్రతి సంవత్సరం దేశంలో దాదాపుగా ఖమ్మం2,500కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.

పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు...

అయితే పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడతాయో చెప్పడం అసాధ్యం. దాంతో చాలా మంది వీటి బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. పిడుగు వంటి విపత్కర పరిస్థితుల గురించి ముందుగానే సమాచారం తెలుసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు. పిడుగులను ముందుగానే గుర్తించి హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ రూపొందించింది. ‘దామిని లైటింగ్‌ అలర్ట్‌’ అనే పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మీ మొబైల్లో ఈ యాప్‌ ఉన్నట్లయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

దీనిని 2020లో కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ (IITM)’ రూపొందించింది. ఇది యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌. దామిని లైటింగ్‌ అలర్ట్‌ అనే ఈ యాప్‌ GOOGLE PLAY STORE, APPLE APP STORE నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. GPS LOCATION తెలుసుకునేందుకు యాప్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. GPS LOCATION ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించి ఈ యాప్‌ ముందుగానే హెచ్చరిస్తుంది. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇది అలర్ట్‌ ఇస్తుంటుంది. చదువుకోని వారికి కూడా ఈ యాప్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలర్ట్‌ సౌండ్‌ ద్వారా విపత్తును ముందుగానే పసిగట్టొచ్చు. అంతేకాదు పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మరణాలు...

 పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం.. 2020లో 2,862 మంది, 2021లో 2,880 మంది, 2022లో 2,887 మంది మరణించారు. గ్రామాల్లోనే 95-96 శాతం పిడుగుపాటు మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికా వంటి దేశాలతో పోల్చితే మన దేశంలో పిడుగుపాటు మరణాలు చాలా ఎక్కువ. అమెరికాలో ఏటా సరాసరి 20 మరణాలు సంభవిస్తున్నాయి. 2006 నుంచి 2021 వరకు ఆ దేశంలో 444 మంది పిడుగులతో చనిపోయారు.

2019 నుంచి దేశంలో పిడుగుపాటు మరణాలు 20 నుంచి 35 శాతం మేర పెరిగినట్టు ఐఎండీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కానీ మన దేశంలో 1967 నుంచి 2019 వరకు లక్ష మంది పిడుగుపాటుకు గురై మరణించారు. ఇది 52 ఏళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో సంభవించిన మరణాల్లో దాదాపు 33 శాతం..! అలాగే వరదల కారణంగా సంభవించిన మరణాలకంటే రెండింతలు ఎక్కువ..! ఐఎండీ గణాంకాల మేరకు ఈశాన్య రాష్ర్టాల్లో అత్యధికంగా పిడుగులు పడుతున్నాయి. కానీ, మధ్యభారతంలోనే పిడుగుపాటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. జూలైలో ఉత్తరప్రదేశ్‌ పిడుగులతో దద్దరిల్లిపోయింది. జూన్‌, జూలైలో బీహార్‌లో ఏకంగా 50 మంది దాకా మృత్యువాతపడ్డారు. ఆ రెండు రాష్ర్టాల్లో నెల వ్యవధిలోనే పిడుగుల కారణంగా సంభవించిన మరణాలు వందకు పైనే ఉన్నాయి. కానీ వీటిని ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగానే కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుండటం గమనార్హం.

దామిని యాప్ ను ఎలా ఉపయోగించాలో చూద్దాం..?

• ముందుగా మీ మొబైల్ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్‌లోకి వెళ్లి.. Damini: Lightning Alert అనే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.

• యాప్‌ ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్ కోడ్ వంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.

• మీ జీపీఎస్ లోకేషన్ తెలుసుకోవడం కోసం యాప్‌కు పర్మిషన్ ఇవ్వాలి.

• ఆ విధంగా మీరు వివరాలు అందించాక యాప్‌లో మీరు ఉన్న ప్రాంత చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్ 40 కిలోమీటర్ల పరిధిలో మరో సర్కిల్ కనిపిస్తోంది.

• అలాగే మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి మూడు రంగులను ఐడెంటిఫికేషన్ కలర్స్ కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా ఈ యాప్ మీరు ఉన్న చోట పిడుగు పడే ఛాన్స్ ఉంటే ముందే హెచ్చరిస్తోంది.

Red Colour:

మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.

Yellow Colour:

మరో 10-15 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంటే యాప్‌లోని సర్కిల్ పసుపు కలర్‌లోకి ఛేంజ్ అవుతుందట.

Blue Colour:

18-25 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్‌లోకి మారిపోతుంది.

Comments

-Advertisement-