DSC 2024: డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇదే చివరి అవకాశం
DSC 2024: డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇదే చివరి అవకాశం
• డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ శుభవార్త
• టెట్ వివరాలను అప్డేట్ చేసుకునే చివరి అవకాశం
DSC 2024: తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ శుభవార్త చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు ఎలాంటి మార్పు లేదని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది.
తెలంగాణ టెట్-2024 మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50, 491 మంది మంది అభ్యర్థులు హాజరయ్యారు.ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. రిజల్ట్ పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణ డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి ఫైనల్ ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే తాజాగా డీఎస్సీ ఫైనల్ కీ వెలువడిన విషయం విదితమే. ఇదిలా ఉండగా.. రెండు మూడు రోజుల్లో డీఎస్సీ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను విడుదల చేస్తే, తర్వాత టెట్ వివరాల అప్డేట్ లో దొర్లిన తప్పులను సవరించే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో టెట్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.