Fuel: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా..?
Fuel rates today
Fuel rates in india
Fuel rates per litre
Petrol Rate in Telangana
Karnataka Petrol Rate
Andhra Pradesh Petrol price today
Job news
By
Peoples Motivation
Fuel: పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా..?
పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయా..
తగ్గితే ఎంత తగ్గుతాయి..?
కేంద్రం నిజంగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందా..?
పండగల సీజన్ కదా..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం.. తగ్గితే భారీగానే తగ్గుతాయని ఊహాగానాలు.. కేంద్రం నిజంగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తుందా..? పండగల సీజన్ కదా.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ప్రజలకు మోదీ పండగ గిఫ్ట్ ఇస్తారు.. అని కొందరంటుంటే.. ఈ టైంలో ఎందుకు తగ్గిస్తుందో? దీనిక వెనక ఓదో కథలేకపోలేదు అని మరికొందరు.. ఇలా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ముడి చమురు ధరలు భారీగానే తగ్గాయి. గత బుధవారం 1శాతం కంటే ఎక్కువగాముడి చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్ ధర 70 యూఎస్ డాలర్లకు దిగువకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధరలు అదే బాట పట్టాయి. బ్యారెలు 1 డాలర్ తగ్గి 72.75 డాలర్లికి చేరుకుంది. తొమ్మిది నెలల కనిష్టానికి ముడి చమురు ధరలు పడిపోయాయి. గ్లోబల్ క్రూడ్ పడిపోవడంతో ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించవచ్చు ప్రచారం జోరుగా సాగుతోంది. చమురు ధరలలో తగ్గుదల జనవరి నుంచి వారి కనిష్ట స్థాయికి చేరుకోవండంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కీలక ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఆకట్టుకునేందుకే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించొచ్చు మరోవైపు ప్రచారం సాగుతోంది. %ూవీజ%ల ఆర్థిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రపంచ చమురు ధరల తగ్గుదలని ఉత్తమంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కేంద్ర మంత్రివర్గంలో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధిక ఇంధన ధరలు ఎదుర్కొంటున్న కస్టమర్లకు ఈ సమయంలో పెట్రోల్ డీజిల్ ధరల తగ్గించి ఉపశమనం కలిగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
Comments