-Advertisement-

DSC: తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు విడుదల

TS Dsc results TS Dsc Hall Ticket TS DSC Result 2024 ts tet.cgg.gov.in 2024 https://tgdsc.aptonline.in/tgdsc/ TS TET 2024 AP TET AP DSC TG DSC results
Peoples Motivation

DSC: తెలంగాణ 2024 డీఎస్సీ ఫలితాలు విడుదల 

TS dsc result TS Dsc Hall Ticket TS DSC Result 2024 ts tet.cgg.gov.in 2024 Ts tet login TS TET Hall Ticket download 2024 TS TET 2024 AP TET AP DSC new

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు.

డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన మూడు వారాలు దాడటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో సోమవారం ఉదయం ఫలితాలను రిలీజ్ చేసేందుకు ముహూర్తం నిర్హయించారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు డీఎస్సీ ఆన్ లైన్ పరీక్షలు నిర్వహిం చింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. 

ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేశారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు 28వేల అభ్యంతరాలు రాగా వీటన్నింటినీ పరిగణ లోనికి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీ రిలీజ్ చేశారు. మరోవైపు ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వీటిపై ఎస్సీఈఆర్టీ కార్యాలయం లో సమీక్ష నిర్వహించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత వారంలో ఫలితాలు వెలువడతాయని భావించినా ఆలస్యం అయ్యింది. ఇప్పటికే మూడు వారాలు దాటిపోయిందని ఆందోళణ వ్యక్తమైన నేపథ్యంలో అనూహ్యంగా సోమవారం ఉదయం ఫలితాలు వెలువ రించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

https://tgdsc.aptonline.in/tgdsc/


Comments

-Advertisement-