-Advertisement-

RRB: నిరుద్యోగులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్.. 14వేల పోస్టులకు మరోసారి దరఖాస్తుల ఆహ్వానం

Railway Recruitment 2024 Apply Online RRB RRC CR Railway recruitment cell Apply Online RRC Recruitment 2024 Railway Recruitment 2024 official website
Peoples Motivation

RRB: నిరుద్యోగులకు రైల్వే బోర్డు గుడ్ న్యూస్.. 14వేల పోస్టులకు మరోసారి దరఖాస్తుల ఆహ్వానం


• రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) టెక్నీషియన్ రిక్రూట్మెంట్  పునఃప్రారంభం..

• టెక్నీషియన్ 14298 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్లీ ప్రారంభం..

• ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని బోర్డు నిర్ణయం..

• అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ..


Railway Recruitment 2024 Apply Online RRB RRC CR Railway recruitment cell Apply Online RRC Recruitment 2024 Railway Recruitment 2024 official website

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తన పాత రిక్రూట్మెంట్లలో 02/2024 నోటిఫికేషన్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ యొక్క 14298 పోస్టులకు పెంచుతూ మళ్లీ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చి-ఏప్రిల్ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది. అయితే ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది.


దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది..?

ఈ రిక్రూట్మెంట్ కోసం తిరిగి దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అక్టోబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఎన్ని పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి..?

RRB టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 కింద.. టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టుకు 1092, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుకు 8052, టెక్నీషియన్ గ్రేడ్ III (వర్క్ షాప్ మరియు పియు) పోస్టు 5154 ఖాళీలు ఉన్నాయి.


ఎవరు అర్హులు..?

టెక్నీషియన్ గ్రేడ్ III కోసం ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 10th పాస్, ITI పాస్ అయి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ /సిగ్నల్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా B.Sc (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/IT)లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి:-

టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 36 సంవత్సరాలు, టెక్నీషియన్ గ్రేడ్ III కోసం వయోపరిమితి 18 నుండి 33 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్)కి మూడేళ్లు, ఎక్స్-సర్వీస్మెన్స్కు 3 నుంచి 8 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 8 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది.


👉దరఖాస్తు కొరకు RRB వెబ్సైట్ http://www.rrbapply.gov.in లో అందుబాటులో ఉంటాయి. 

Comments

-Advertisement-