Free Aadhaar Update: ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు
Free Aadhaar Update: ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు
Free Aadhaar Update: ఆధార్ కార్డును పదేళ్లుగా అప్డేట్ చేసుకోని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈనెల 14న ముగియనుండటంతో గడువును పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. గడువు పూర్తయ్యాక రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పని చేస్తుందని UIDAI తెలిపింది.
ఆధార్ కార్డ్( Aadhaar Card ) ప్రస్తుతం భారతీయులందరికీ ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ఉద్యోగం లేదా ఏదైనా ప్రభుత్వ పథకం, బ్యాంకు సంబంధిత పనులకు ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం UIDAI 10 సంవత్సరాల పాత ఆధార్ కార్డులను పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసేకునే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి రేపే (సెప్టెంబర్ 14) చివరి తేదీగా ఉంది. కాగా తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో మీరు ఈ తేదీలోగా పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వయస్సుకు సంబంధించి ఆధార్ కార్డ్‌లో మార్పులు చేయాలనుకుంటే ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ విధానంలో ఇలా...
తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. UIDAI తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ సౌకర్యాన్ని అందిస్తోంది. డిసెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డులో మీరు ఎలాంటి అప్‌డేట్‌కైనా రూ.50 రుసుము చెల్లించాలి. గతంలో దీని గడువు చాలాసార్లు పొడిగించబడింది. దీంతో మరోసారి డిసెంబర్ 14 వరకు గడువు పొడిగించారు. ఈ క్రమంలో మీరు ఆధార్ కార్డ్‌ను ఆన్‌లైన్ విధానంలో ఎలా అప్‌డేట్ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
మీ ఆధార్ కార్డ్‌ని ఇలా అప్‌డేట్ చేసుకోండి..
• ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి, ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in కి వెళ్లి లాగిన్ అవ్వాలి
• లాగిన్ చేయడానికి, మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్, అక్కడ ఇవ్వబడిన అక్షరాలను నమోదు చేయాలి
• ఆ తర్వాత, మీ ఆధార్ కార్డ్‌లో నమోదు చేయబడిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, మీరు పోర్టల్‌లో నమోదు చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి
• లాగిన్ అయిన తర్వాత, మీకు స్క్రీన్‌పై అనేక ఎంపికలు కనిపిస్తాయి, వాటిలో మీరు 'ఆధార్ అప్‌డేట్'పై క్లిక్ చేయాలి
• అక్కడ మీరు మీ ప్రొఫైల్ చూస్తారు. అప్పుడు మీరు అప్‌డేట్ చేయాల్సి ఉన్నా, ఆ ఆప్షన్‌లో సరిగ్గా నమోదు చేసి, పైన పేర్కొన్న వివరాలు సరైనవని ధృవీకరించానని టిక్ చేయడం ద్వారా సమర్పించండి
• దీని తర్వాత మీరు చిరునామా మారినట్లయితే, చిరునామా రుజువు పత్రం వంటి అప్‌డేట్‌కు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి సమర్పించాలి
• చివరగా మీరు మీ అభ్యర్థన స్థితిని ట్రాక్ చేయడానికి SMS ద్వారా అప్‌డేట్ అభ్యర్థన సంఖ్య (URN)ని అందుకుంటారు
ఈ సంఖ్య ద్వారా మీరు మీ అప్‌డేట్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.