Breaking News: ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది మృతి
Breaking News: ఘోర రోడ్డు ప్రమాదం ఎనిమిది మంది మృతి
రెండు లారీలను ఢీకొన్న బస్సు..
మొగిలి ఘాట్ వద్ద ప్రమాదం..
తిరుపతి నుంచి బెంగళూరుకు వెళుతుండగా ప్రమాదం..
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలను బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
దీంతో ఐరన్ లోడ్‌తో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఆ తర్వాత రెండు వాహనాలు మరో టెంపోపైకి దూసుకెళ్లటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అయితే స్పాట్‌లో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. లారీలో ఇనుప చువ్వలు ఉండటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది.
తెలిపిన సమాచారం ప్రకారం.. ఓ బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపునకు వెళ్తుండగా మొగిలి ఘాట్ వద్ద అదుపుతప్పింది. గాయపడిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.