Free Sand: ఇసుక బుకింగ్ ఆన్లైన్లో ఇలా చేసుకోండి
Free Sand: ఇసుక బుకింగ్ ఆన్లైన్లో ఇలా చేసుకోండి..!
ఏపీలో ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ వెబ్సైట్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ. 12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా వెబ్సైట్ ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్ కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం తో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లేప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు..
ఇసుక ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం ఇలా....
వెబ్సైట్లోని ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (APSMS) పోర్టల్లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
• ఆ తర్వాత జనరల్ కన్జ్యూమర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
• మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
• ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి.
• పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.