Agniveer Army: ఆ జిల్లాల అభ్యర్థులకు శుభవార్త.. నవంబరు 10 నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
Army Rally Date 2024
Join Indian Army
Join Indian Army Rally Notification
Join Indian Army Rally Notification 2024
join indian army.com online
Login
By
Peoples Motivation
Agniveer Army: ఆ జిల్లాల అభ్యర్థులకు శుభవార్త.. నవంబరు 10 నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
నవంబరు 10 నుంచి 15వ తేదీ వరకు కడప నగరంలో నిర్వహించే అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విజయవంతానికి అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం డైరెక్టర్ కల్నల్ పునీత్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, మేజర్ అమర్దాప్కుమార్తో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. నియామకపు బోర్డు విధివిధానాలకు అనుగుణంగా విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలన్నారు. డీఆర్వో గంగాధరౌడ్, నగర పాలక కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు.
Comments