Govt Jobs: SBI లో 1511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... పోస్టుల వివరాలు ఇవే..!
Govt Jobs: SBI లో 1511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... పోస్టుల వివరాలు ఇవే..!
ప్రభుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1511 ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు:
జూన్ 30, 2024 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేలు:
డిప్యూటీ మేనేజర్లకు రూ.64,820 నుంచి రూ.93,960. అసిస్టెంట్ మేనేజర్లకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు ఇవే..
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ: 187 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్
ఆపరేషన్స్: 412 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్వర్కింగ్ ఆపరేషన్స్: 80 పోస్టులు
మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్లో 176 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్: 27 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు
- అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్): 798 పోస్టులు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా 2024 అక్టోబర్ 04 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇