Port Blair: ఇంక నుంచి శ్రీవిజయపురం గా పోర్ట్ బ్లెయిర్.. పేరు మార్చిన కేంద్రం
Port Blair: ఇంక నుంచి శ్రీవిజయపురం గా పోర్ట్ బ్లెయిర్.. పేరు మార్చిన కేంద్రం
పేరు మార్చుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించిన అమిత్ షా..
పోర్టు బ్లెయిర్ అనే పేరు వలసవాద పోకడలను సూచిస్తోందని వెల్లడి..
అండమాన్ నికోబార్ దీవుల రాజధానిగా ఉన్న పోర్టు బ్లెయిర్..
కొత్త పేరు స్వాతంత్ర్య సమర విజయానికి ప్రతీక అని వివరణ..
కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరు మారింది. ఇక నుంచి పోర్టు బ్లెయిర్ ను శ్రీవిజయపురం అని పిలవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ ప్రకటనలో తెలిపారు.
పోర్టు బ్లెయిర్ అనే పేరు వలసవాద పోకడలను సూచిస్తోందని, శ్రీవిజయపురం అనే పేరు మన స్వాతంత్ర్య సమర విజయాన్ని, అండమాన్ నికోబార్ దీవుల ప్రత్యేక పాత్రకు ప్రతిబింబంలా నిలుస్తుందని వివరించారు. అండమాన్ నికోబార్ దీవులకు దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, చరిత్రలోనూ అసమానమైన స్థానం ఉందని అమిత్ షా కీర్తించారు.
అండమాన్ నికోబార్ దీవులకు మన స్వాతంత్ర్య పోరాటంలో, చరిత్రలో సుస్థిర స్థానం ఉందని, ఒకప్పుడు చోళ సామ్రాజ్యం 'నావికా స్థావరం' (నేవల్ బేస్)గా ఈ ఐలాండ్ ప్రాంతం సేవలందించిందని, ఈరోజు మన దేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా కీలక స్థావరం నిలిచిందని అమిత్‌షా అభివర్ణించారు. మన త్రివర్ణ పతాకాన్ని తొలుత ఇక్కడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎగురవేశారని, దేశ స్వాతంత్ర్య కోసం పోరాడిన వీర సావార్కర్ వంటి పలువురు యోధులు ఇక్కడి జైలులో ఉన్నారని అమిత్‌షా గుర్తుచేశారు.