-Advertisement-

Jaggery: రోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Jaggery benefits Jaggery advantages
Janu

Jaggery: రోజూ బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?

ప్రతి ఇంట్లో బెల్లం తప్పకుండా ఉంటుంది. ఆయుర్వేదంలో బెల్లాన్ని ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో మన శరీరానికి మేలు చేసే ప్రోటీన్, విటమిన్ బి12, కాల్షియం, ఐరన్లు ఉంటాయి. ఇన్ని పోషకాలున్న బెల్లాన్ని కాదని మనలో చాలా మంది బెల్లంకి బదులు చక్కెరను వాడుతుంటారు. పంచదార కంటే బెల్లం చాలా రెట్లు బెటర్. రాత్రి భోజనం అనంతరం బెల్లం తింటే అమృతంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతుంటారు. రాత్రి నిద్రపోయే ముందు తప్పని సరిగా ఓ బెల్లం ముక్కను తినాలని సూచిస్తుంటారు.

Health news health tips Telugu health benefits in Telugu health losses in Telugu Health and fitness Lifestyle news Jaggery benefits Jaggery advantages

బెల్లం మన శరీరంలో వేడిని పెంచుతోంది. ఈ బెల్లం తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నయంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు.. అవేంటో చూద్దాం.. వయసు పెరిగే కొద్ది జీర్ణ సమస్యలు ఎక్కువవుతుంటాయి. జీర్ణ శక్తి మందగించడంతో సకాలంలో ఆహారాన్ని తీసుకోలేక పోతారు. దానికి మంచి చిట్కా బెల్లమే అని వైద్యులు చెబుతున్నారు. రోజూ బెల్లం తినడం వల్ల జీర్ణ సమస్యలు నయమవుతాయి. రాత్రి భోజనం అనంతరం బెల్లం తింటే.. కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయ

శీతాకాలంలో బెల్లం బాగాపనిచేస్తుంది. తరచూ జలుబు, దగ్గులతో బాధ పడే వారు.. బెల్లం తీసుకోవం ఉత్తమం. సాయంత్రం పూట బెల్లం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గుతో పాటు కఫం వంటి రుగ్మతలు కూడా తగ్గుతాయని.. పాలలో బెల్లం కలిపి తాగడంతో శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చర్మం అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కాని పలు రకాల కారణాల వల్ల చర్మ వ్యాధులు వేధిస్తుంటాయి. వాటిని అరికట్టేందుకు బెల్లం మెడిసిన్ లా ఉపయోగపడుతుంది. రోజు కొద్దిగా బెల్లం తినడం వల్ల మొఖం మీద ఏర్పడే మొటిమలు తగ్గుతాయి. తరచూ బెల్లం తింటే చర్మం మెరుస్తుంది.

Comments

-Advertisement-