LHMS: ఊరికి వెళుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! పోలీస్ నిఘా కెమెరా పెట్టించుకోవడం మరిచిపోకండి.
ఊరికి వెళుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! పోలీస్ నిఘా కెమెరా పెట్టించుకోవడం మరిచిపోకండి.
• పోలీస్ శాఖ వారు ఉచితంగా ఎర్పాటు చెసే LHMS కెమరాలను మరిచిపోకండి..
• మీరు నిచ్చితంగా ఊరికి వెళ్ళిరండి పోలిస్ LHMS కెమెరాలు మీ ఇంటిని డేగ కన్నుతో కాపలా కాస్తుంది..
• ఆ ఏముందీ లే అనే అలసత్వం వహిస్తే మరోమాట లెకుండా అయ్యో అనే పరిస్తితి వస్తుంది గృతించండి.. పోలిస్ సేవలను వినియోగించుకోండి..
• పట్టణ ప్రజలకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ విజ్ఞప్తి..
తిరుపతి, సెప్టెంబర్ 22 (పీపుల్స్ మోటివేషన్):-
తిరుపతి పట్టణ పరిధిలో నివాసముంటున్నవారు కుటుంబ అవసరాల నిమిత్తము లేదా విహార యాత్రల కొరకో లేదా ఇంత అవసరముల కొరకు ఇంటిలో ఎవరు లేకుండా తాళములు వేసి బయటకు వెళ్ళినపుడు ఇంటిలో దొంగలు పడి విలువైన వస్తువులను దోచుకుని వెల్లె పరిస్థితి జరుగుతూ ఉంటుంది..
ఇలాంటివి జరుగకుండా నిలువరించేందుకు పోలీస్ వారు ఇల్లు విడిచి ఊరికి వెళుతున్న వారి ఇళ్లను గుర్తించి వారి ఇంటిపై పోలీస్ LHMS కెమరా/నిఘా/గస్తీ ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే పోలీసువారు మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో సరికొత్తగా సాంకేతిక పరిజ్ఞానంతో LHMS (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం) పేరుతో ఒక అప్లికేషన్ డిజైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావడము జరిగినది.
ఇల్లు విడిచి ఊరికి వెళ్తున్నవారు తమ దగ్గరలో గల పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ వారికీ సమాచారం ఇస్తే వారి ఇంటినందు పోలీస్ వారు LHMS కెమెరాను ఏర్పాటు చేస్తారు.
అనుకోని దొంగతనం లాంటి ఘటనలు జరిగితే ఈ కెమెరా లోని టెక్నాలజీ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కి సెన్సార్ ద్వారా మేసేజ్ అందుతుంది...వారు అప్రమత్తమై దగ్గరలో వున్న పోలీస్ సిబ్బందికి తెలియజేసి ఇంటిలోనికి అనుమతిలేకుండా ప్రవేశించిన వారిని అదుపులోనికి తీసుకొని మీ ఇంటిలో ఎలాంటి దొంగతనము జరుగకుండా చూస్తామని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., ఒక ప్రకటనలో తెలిపారు.
ఫలితంగా ఇళ్లలో దొంగతములు జరగకుండా విలువైన సొత్తు పోకుండా నివారించుటకు అవకాసం ఉంటుంది.. ఈ కేమరాలను తిరుపతి పోలిస్ వారు ఉచితంగా ఎర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు మీ ఇంటికి రక్షణతో పాటు మీ ప్రయాణం సుఖాంతం అవుతుంది కావున ఇంటిని వదిలి వెళ్ళే వారు కచ్చితంగా LHMS కెమెరాలను విరివిగా వినియోగించుకోవలసిందిగా పట్టణ ప్రజలకు తిరుపతి జిల్లా పోలీస్ వారి విజ్ఞప్తి చేశారు.