-Advertisement-

SBIF Asha Scholarship: 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఫ్రీ స్కాలర్షిప్ ప్రోగ్రాం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET SBI free asha scholarship new
Peoples Motivation

SBIF Asha Scholarship: 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఫ్రీ స్కాలర్షిప్ ప్రోగ్రాం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ప్రతిభ ఉన్నా.. చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. గొప్ప స్థితిలో ఉండాలనే ఆకాంక్ష ఉన్నప్పటికీ పేదరికం వారికి అడ్డుపడుతుంటుంది. అయితే.. ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనందించి, వారి విద్యను ప్రోత్సహించేందుకు ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 3వ ఎడిషన్ ను ఎస్బీఐ ఫౌండేషన్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా వెనకబడిన వర్గాలకు చెందిన టాలెంటెడ్ స్టూడెంట్స్ కి సాయం చేసేందుకు రూపొందించినదే ఈ ప్రోగ్రామ్. ఈ నేపథ్యంలో 6 తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కు ఎలా అప్లై చేసుకోవాలి? అర్హతలేంటి? కావాల్సిన డాక్యుమెంట్లు? లాస్ట్ డేట్ ఎప్పుడు? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

General News telugu latest news telugu intresting news telugu intresting facts Job news health news TS TET TS DSC AP TET SBI free asha scholarship new

దరఖాస్తు అప్లై చేసుకునే విధానం

అర్హత:-

• కేవలం భారతీయులు మాత్రమే అప్లై చేసుకోవాలి.

• అప్లై చేసుకునే వారు ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో క్లాస్ 6 నుంచి క్లాస్ 12 మధ్యలో ఉండాలి.

• గత అకడమిక్ ఇయర్లో కనీసం 75శాతం మార్కులు వచ్చి ఉండాలి.

• స్థూల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 3లక్షలు దాటకూడదు.

• ఇందులో 50శాతం స్లాట్లు ఫీమేల్స్కు కేటాయిస్తారు.

• ఎస్ఎస్, ఎస్టీ అప్లికేషన్లకు ప్రిఫరెన్స్ ఉంటుంది.

• ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 15వేల స్కాలర్షిప్ లభిస్తుంది.

కావాల్సిన సర్టిఫికేట్లు:-

• గత అకడమిక్ ఇయర్ మార్క్ షీట్ 

• గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ (ఆధార్)

• ప్రస్తుత ఏడాది ఎడ్యుకేషన్ ఫీజ్ రిసిప్ట్ 

• ప్రస్తుతం అడ్మిషన్ ప్రూఫ్

• బ్యాంకు అకౌంట్ వివరాలు(పిల్లలకు లేకపోతే తల్లిదండ్రులది)

• ఆదాయ ధ్రువీకరణ పత్రం

• పాస్ ఫొటో 

• కుల ధ్రువీకరణ పత్రం (కావాల్సివస్తే)

ఎలా అప్లై చేసుకోవాలి..?

కింది అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి👇

sbifashascholarship.org

Scholarships కాలమ్లో SBIF Asha Scholarship Program for School Studentపై క్లిక్ చేయండి.

అందులో Apply Now ఆప్షన్పై క్లిక్ చేయండి. వేరే పేజీ ఓపెన్ అవుతుంది.

అక్కడ మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. మీరు ముందుగానే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కు అప్లై చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి. లేదంటే Register ఆప్షన్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి Registration పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆ వివరాలతో Buddy4Study లో లాగిన్ అవ్వాలి.

ఆ తర్వాత SBIF Asha Scholarship Program 2024 అప్లికేషన్ ఫామ్ని పూర్తి చేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి.

ప్రివ్యూ చేసి సబ్మీట్ చేయండి.

సెలక్షన్ ప్రక్రియ:- అకడమిక్ పర్ఫార్మెన్స్, ఆర్థిక అవసరాలు, మెరిట్ ఆధారంగా ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ 2024 సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటిల్లో ఎంపికైతే బ్యాంక్ ఖాతాలోకి స్కాలర్షిప్ డబ్బులు జమ అవుతాయి.

చివరి తేదీ:- ఆసక్తిగల విద్యార్థులు అక్టోబర్ 1లోపు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది సంవత్సరానికి ఒక్కసారి అందించే స్కాలర్షిప్ ప్రోగ్రామ్.

కింది అధికారిక వెబ్సైట్ పై క్లిక్ చేసి అప్లై చేయండి 👇 

sbifashascholarship.org

Comments
Comment Poster
6th class

-Advertisement-