MHSRB: మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 3334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
MHSRB: మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 3334 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
• రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎంహెచ్ఎస్ఆర్బీ బోర్డు గుడ్ న్యూస్..
• వైద్య, ఆరోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్) పోస్టులు..
• డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 1576 స్టాఫ్ నర్సు పోస్టులు..
• వైద్య విధాన పరిషత్ కింద 332 పోస్టులు..
•ఎంఎన్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 పోస్టులు..
• ఆయుష్ 61, ఐపిఎంలో ఒక స్టాఫ్ నర్సు...
• తాజాగా 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలకు సిద్దమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్డీ) తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్/డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 332, MN క్యాన్సర్ హాస్పిటల్లో 80, AYUSH 61, IPMలో ఒక స్టాఫ్ నర్సు, మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం కింది అధికారిక వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేయండి.
తాజాగా, 1,284 Lab Technician Grade-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 1088, వైద్య విధాన పరిషత్లో 183, ఎంఎన్నో క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 5 చివరి తేదీగా ప్రకటించారు.
ముఖ్యమైన సమాచారం
అర్హతలు:-
తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదైన వివరాలతో పాటు జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ (GNM) లేదా B.Sc (నర్సింగ్)లో ఉత్తీర్ణత.
వయోపరిమితి:-
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి గతంలో 44 ఏళ్లుగా ఉండగా, తాజాగా 46 ఏళ్లకు పెంచారు.
పే స్కేలు: రూ. 36,750 - రూ. 1,06,990 వరకూ
ఎంపిక ప్రక్రియ:-
రాత పరీక్ష 80 పాయింట్లను కలిగి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు మరియు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ కు 20 పాయింట్లు ఇవ్వబడతాయి.
దరఖాస్తు రుసుము:-
రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం:- ఆన్లైన్ ద్వారా
ప్రారంభ తేదీ :- 8-09-2024 నుండి
ముగింపు తేదీ :- 14-10-2024 వరకు