Rates: పండగ వేళ ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు
Rates: పండగ వేళ ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు
• పండగల సీజన్ మొదలు సామాన్యులకు షాక్ ఇస్తున్న నిత్యావసర ధరలు..
• దీపం నూనె నుంచి వంట నూనెలల వరకు కంపెనీని బట్టి కిలోకు రూ.20 నుంచి రూ. 40 పెంపు...
• పండగపూజ ఈ ధరలను చూసి భయపడుతున్న సామాన్య ప్రజలు...
పండుగల సీజన్ మొదలు దసరా, దీపావళి పండగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఏ కిరాణా కొట్టు వెళ్లినా ధరల భారం తప్పడం లేదని మహిళలు అంటున్నారు. దేవుడికి పెట్టే దీపం నూనె నుంచి వంట నూనెల ధరలు కంపెనీని బట్టి కిలోకు రూ.20 నుంచి రూ. 40 వరకు పెరిగిపోవడంతో.. కోట్లాది రూపాయల హోల్సేల్ వ్యాపారం జరిగే ప్రాంతాల్లో ధరల్లో వ్యత్యాసం కనబడుతుంది.
కిలోకు రూ.20 నుంచి రూ. 40 పెంపు...
గత నెలలో వివిధ రకాల పప్పుల మీద కిలోకి రూ.20 నుంచి రూ.40 వరకు రేట్లు పెరిగిపోయాయి. కిలో తెల్లగడ్డలు రూ.300 ఉంటే ప్రస్తుతం రూ.350కి చేరింది. చిల్లర దుకాణాల్లో కిలో రూ.400లకు అమ్ముతున్నారు. ఇక, కేజీ కందిపప్పు రూ.150 ఉండగా.. రూ. 175కి పెరిగిపోయింది. ఇక పెసరపప్పు కూడా 150 రూపాయలకు చేరింది. అలాగే, మినపప్పు కూడా సుమారు రూ.135లకి పెరిగింది. అలాగే, లీటర్ నూనె ప్యాకెట్ పై కూడా రూ. 20 నుంచి రూ. 50 వరకు ధరలు పెరిగింది. పోనీ కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. వంకాయ, బెండకాయ, కాకరకాయ, చివరకు సొరకాయ ధర కూడా అమాంతం పెరిగింది. ఇక వెల్లుల్లి ధర డబుల్ అయ్యింది. ఎండు మిర్చి 200రూపాయలకు చేరింది. దీంతో పండగపూజ ఈ ధరలను చూసి సామాన్య ప్రజలు షాక్ అవుతున్నారు.