RRB: ఇంటర్ అర్హతతో రైల్వేలో 3,445 క్లర్క్ & టైపిస్ట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల
RRB: ఇంటర్ అర్హతతో రైల్వేలో 3,445 క్లర్క్ & టైపిస్ట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల
రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆర్ఆర్బీ గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ చదివిన వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు...
నిరుద్యోగులకు రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,445 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో NTPC నాన్-టెక్నికల్ పాపులర్ (అండర్ గ్రాడ్యుయేట్) కేటగిరీలో - కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు :-
సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పుర్, జమ్ము & శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ.
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు:-
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ - 2,022 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 361 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 990 పోస్టులు
ట్రైన్స్ క్లర్క్ - 72 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య - 3,445
రీజియన్ల వారీగా పోస్టుల వివరాలు
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్ - 56
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు - 60
ఆర్‌ఆర్‌బీ చెన్నై - 194
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్ - 89
విద్యార్హతలు :-
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్/ ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్/ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లీష్/ హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.
వయోపరిమితి :-
2025 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.దివ్యాంగులకు, ఎస్టీ, ఎస్సీలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :-
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి.మహిళలు, ఈబీసీ, ఈఎస్ఎం, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.250 కట్టాలి.
ఎంపిక ప్రక్రియ :-
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం :-
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లకు నెలకు రూ.21,700; ఇతర పోస్టులకు రూ.19,900 జీతం ఉంటుంది.
పరీక్ష విధానం:-
ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ : జనరల్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు - 40 మార్కులు), మ్యాథ్స్ (40 ప్రశ్నలు - 40 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (40 ప్రశ్నలు - 40 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య - 100, మొత్తం మార్కులు - 100.
పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ : జనరల్ అవేర్‌నెస్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), మ్యాథ్స్ (35 ప్రశ్నలు- 35 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (35 ప్రశ్నలు - 35 మార్కులు). మొత్తం ప్రశ్నల సంఖ్య - 120, మొత్తం మార్కుల సంఖ్య - 120. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం:-
ముందుగా మీరు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.RRB NTPC Recruitment 2024 లింక్పై క్లిక్ చేయాలి.మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.వెంటనే మీకొక ఎన్రోల్మెంట్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.వీటితో మళ్లీ ఆర్ఆర్బీ పోర్టల్లోకి లాగిన్ కావాలి.అప్లికేషన్ ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.ఆన్లైన్లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
ముఖ్య తేదీలు:-
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 21
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 20
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ : 2024 అక్టోబర్ 22
దరఖాస్తు సవరణ తేదీలు : 2024 అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు
మిగతా సమాచారం అధికారిక వెబ్సైట్లో చూడగలరు.