-Advertisement-

Sitaram yechuri: అస్తమించిన ఎర్ర సూరీడు

Sitaram Yechury first wife Akhila Yechury Seema Chisti Yechury age Sitaram Yechury house Sitaram Yechury contact Number Sitaram yechury funeral Yechur
Peoples Motivation
Sitaram yechuri: అస్తమించిన ఎర్ర సూరీడు

వామపక్షనేత, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి.. దశాబ్దాలుగా పార్టీలో, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేవలం కమ్యూనిస్ట్ గా మాత్రమే కాకుండా ఆర్థిక వేత్తగా, సామాజిక కార్యకర్తగా, కాలమిస్ట్గా ఆయన ఎంతో గుర్తింపు పొందారు. దాదాపు సీపీఎంతో 50ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్నికొనసాగించిన ఈ ఎర్ర సూరీడు అస్తమించారు. ఇక సుదీర్ఘ కాలంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఇక తెలుగు గడ్డపై పుట్టిన సీతారాం ఏచూరి.. విద్యార్థి దశలోనే వామపక్షం వైపు మళ్లారు. ఈ క్రమంలోనే ఢిల్లీ జేఎనూలో చదువుకుంటున్న సమయంలోనే సీపీఎంలో చేరారు. మరోవైపు.. ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది.
Sitaram Yechury first wife Akhila Yechury Seema Chisti Yechury age Sitaram Yechury house Sitaram Yechury contact Number Sitaram yechury funeral Yechury surname Sitaram yechury family photos

సీతారాం ఏచూరి బాల్యం

1952 ఆగస్టు 12వ తేదీన అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో సీతారాం ఏచూరి జన్మించారు. సర్వేశ్వర సోమయాజులు, కల్పకం ఏచూరి దంపతులకు ఆయన పుట్టారు. తండ్రి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ సేవలు అందించగా.. తల్లి కల్పకం ఏచూరి " కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎస్ మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనల్లుడు కావడం గమనార్హం. హైదరాబాద్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన సీతారాం ఏచూరి.. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు.

సీతారాం ఏచూరి విద్యాభ్యాసం

1970లో సీబీఎస్సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా సీతారాం ఏచూరి నిలిచారు. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేసిన ఆయన.. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ-జేఎనయూ నుంచి ఎంఏ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత జేఎనీయూలోనే పీహెచ్ఎలో చేరినా.. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించగా.. అరెస్ట్ కావడంతో పీహెచ్డీని పూర్తి చేయలేక పోయారు. సీతారాం ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందర్ కాగా.. ఆ తర్వాత జర్నలిస్ట్ సీమా చిక్తిని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం ఉండగా కుమారుడు కాకిష్ ఏచూరి 2021లో కరోనా కారణంగా మృతి చెందారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి సీతారాం ఇక ఏచూరి 1974లో విద్యార్థి నేతగా సీతారాం ఏచూరి ఎస్ఎస్ఐఐలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాతి ఏడాదికే 1975లో జేఎసీయూలో చదువుతున్న సమయంలో సీపీఎంలో చేరారు. ఇక జేవినీయూ స్టూడెంట్స్ యూనియన్కు 3సార్లు అధ్యక్షుడిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తో కలిసి జేఎనీయూను వామపక్ష పార్టీకి అడ్డాగా మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కూడా సీతారాం ఏచూరి పనిచేశారు. ఆ తర్వాత 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. అనంతరం 1992లో సీపీఎం పాలిట బ్యూరో సభ్యుడిగా సీతారాంఏచూరిఎన్నికయ్యారు. ఇక తొలిసారిగా 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో వైజాగ్లో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 2015 నుంచి చనిపోయే వరకు కూడా సీతారాం ఏచూరి అదే పదవిలో కొనసాగారు. ఇక ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై రాజ్యసభలో నిరంతరం ప్రస్తావిస్తూ సీతారాం ఏచూరి బాగా గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం "కామన్ మినిమమ్ ప్రోగ్రామ్" ముసాయిదాను రూపొందించడంలో కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరంతో పాటు సీతారాం ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడంలోనూ సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారు. రాజకీయాలే కాకుండా రచయితగానూ ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్' పేరుతో ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపరు సీతారాం ఏచూరి కాలమ్స్ రాశారు. "క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే", "సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్", "మోదీ గవర్నమెంట్: న్యూ సర్ట్ ఆఫ్ కమ్యూనలిజం". "కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం" వంటి పుస్తకాలను సీతారాం ఏచూరి రాశారు.
Comments

-Advertisement-