-Advertisement-

SSC JOBS: 10వ తరగతి అర్హతతో ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ITBP Recruitment ITBP login ITBP Pay Slip ITBP PIS Itbp clms login ITBP wikipedia ITBP Admit Card ITBP Result
Peoples Motivation

SSC JOBS: 10వ తరగతి అర్హతతో ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు సువర్ణావకాశం... ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) 819 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరమితి, ఫీజు, దరఖాస్తు రుసుము తదితర పూర్తి వివరాలు..

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) నాన్ గెజిటెడ్‌ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలోని 819 కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ITBP Recruitment ITBP login ITBP Pay Slip ITBP PIS Itbp clms login ITBP wikipedia ITBP Admit Card ITBP Result

ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్ (కిచెన్ సర్వీసెస్) : 819 పోస్టులుపురుషులు - 697 పోస్టులుమహిళలు - 122 పోస్టులు

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు:

UR - 458, OBC - 162, EWS - 81, ST- 70, SC- 48

విద్యార్హతలు:

మెట్రిక్యులేషన్/ 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.దీనితో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్‌ కోర్సులో క్వాలిఫై అయ్యుండాలి.

శారీరక ప్రమాణాలు:

పురుషుల ఎత్తు 165 సెం.మీ., మహిళల ఎత్తు 155 సెం.మీ. ఉండాలి.పురుషుల ఛాతీ 75 సెం.మీ. నుంచి 80 సెం.మీ. మధ్య ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.100 చెల్లించాలి.మహిళలు, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

పే స్కేలు: ఐటీబీపీ కానిస్టేబుల్కు నెలకు రూ.21,700 - రూ.69,100 జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అర్హులైన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ముందుగా ITBP అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్లి అప్లికేషన్ లింక్పై క్లిక్ చేయాలి.దరఖాస్తు ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 సెప్టెంబర్ 2ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 1

ముఖ్యాంశాలు:

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)- 819 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 1వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Comments

-Advertisement-